Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ వేడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వడదెబ్బతగిలే ప్రమాదం ఉంది. కాబట్టి.. మనం తీసుకునే ఆహారం, వేసుకొనే దుస్తులపైనా దృష్టి పెట్టాలి..
- ఎండ వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవటమే కాకుండా చర్మ సంబంధిత సమస్యలూ తలెత్తుతాయి. రోజుకి రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తప్పకుండా తీసుకోవాలి.
- చెమటను పీల్చేందుకు, శరీరాన్ని చల్లగా ఉంచేందుకు తేలికపాటి కాటన్ వస్త్రాలు ధరించాలి. వ్యాయామం లాంటివి ఉదయం తొమ్మిది గంటల్లోపు సాయంత్రం అయిదు తర్వాత చేయడం మంచిది.
- ఆహారాన్ని తక్కువ పరిమాణంలో తీసుకుంటే తేలికగా జీర్ణమవుతుంది. వేపుళ్లు, ఎక్కువ మసాలా వేసిన మాంసాహారాలు కాకుండా ఉడకబెట్టిన కూరగాయలు, తాజా పండ్లకు ప్రాధాన్యమివ్వాలి.
- బయటకు వెళ్లాల్సి వస్తే వాటర్ బాటిల్, గ్లూకోజ్‌ను అందుబాటులో ఉంచుకోండి. కళ్లను యూవీ కిరణాల నుంచి కాపాడుకునేందుకు సన్‌గ్లాసెస్‌ను తప్పకుండా ఉపయోగించండి. తలకు ఎక్కువ వేడి తగలకుండా స్కార్ఫ్‌ని కట్టుకోండి. ఎస్పీఎఫ్ ఉన్న క్రీముల్ని రాసుకున్నాకే బయటకు వెళ్లండి.
- కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీలు తీసుకోవడం వల్ల నీరంతా పోయి శరీరం డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి వేసవిలో వాటిని చాలా వరకు తగ్గిస్తేనే మంచిది.