Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలు కౌమారంలోకి అడుగుపెట్టాక తెలిసీ తెలియక ఆకర్షణలకు లోనవుతుంటారు. ఒకవేళ వారు ఎంచుకున్న వ్యక్తులు హింసించే వారైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ విషయాన్ని ఎవరితో చెప్పుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. అలాంటప్పుడు తల్లిగా మనం ఏం చేయాలంటే..
- సమస్యను వారంతట వారే చెప్పే స్వేచ్ఛ వాళ్లకుండాలి. తమ ఇబ్బందిని చెప్పినా నిందించొద్దు. విషయాన్ని పూర్తిగా వినాలి. తప్పు చేశామని కుంగిపోయేలా చేయక తోడు నిలవాలి.
- ఈ సమయంలో వారు మన నుంచి ఓదార్పు కోరుకుంటారు. ఇలాంటప్పుడే మన ప్రేమనీ, భరోసాను అందించాలి. అప్పుడే వాళ్లు ఆ బంధం నుంచి బయటపడగలిగే ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకోగలరు. తాము ప్రేమిస్తున్న వ్యక్తి గురించి చెడుగా చెప్పకుండా పరిస్థితులు అర్థమయ్యేలా మాత్రమే చెప్పాలి. వాళ్లంతట వాళ్లే తెలుసుకున్నప్పుడే దాన్నుంచి బయటకు రాగలరు.
- అమ్మాయి ప్రేమించిన వ్యక్తి మంచివాడు కాకపోతే విడిపొమ్మని నేరుగా చెప్పకండి. బెదిరింపులు అసలే వద్దు. వారంతట వారే ఆ నిర్ణయం తీసుకోడానికి సిద్ధమైతేనే వాళ్లు దృఢంగా తయారవుతారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.