Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్రిజ్‌లో పెడితే పదార్థాలు పాడైపోవు అనుకుంటారు చాలామంది. కానీ వాటికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అంతేకాదు.. అవి చూడ్డానికి, రుచికి బాగానే ఉంటాయి.. కానీ మన ఆరోగ్యాన్ని పాడు చేసే బ్యాక్టీరియా వాటిలో అభివృద్ధి చెందుతుంది అంటున్నారు నిపుణులు. కాబట్టి ఏ పదార్థం ఎప్పుడు ఫ్రిజ్‌లో పెట్టాలి? ఎన్ని రోజులు ఉంచాలి? తెలుసుకుందాం...
- ఏ కాలంలోనైనా ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల ఫారన్‌హీట్ (4.4 డిగ్రీల సెల్సియస్)కు మించకుండా చూసుకోవాలి.
- పాలు, పాల పదార్థాలు, మాంసం, కోడిగుడ్లు, చేపలు.. వంటి త్వరగా పాడైపోయే పదార్థాలు బయటి నుంచి తెచ్చిన రెండు గంటల్లోపే ఫ్రిజ్‌లో పెట్టేయాలి. ఒకవేళ బయట ఉష్ణోగ్రత 90 డిగ్రీల ఫారన్‌హీట్ (32.2 డిగ్రీల సెల్సియస్) కంటే ఎక్కువగా ఉన్నట్లయితే తెచ్చిన గంటలోపే ఈ పదార్థాల్ని ఫ్రిజ్‌లో పెట్టాలి.
- గడ్డకట్టిన పదార్థాలను కిచెన్ ప్లాట్‌ఫామ్, టేబుల్‌పై పెట్టి వాటంతటవే కరిగిపోతాయి అని వదిలేయడం మంచిది కాదు. ఎందుకంటే గది ఉష్ణోగ్రత వద్దకు చేరేసరికి ఆయా పదార్థాల్లోని బ్యాక్టీరియా రెండింతలవుతుంది. కాబట్టి కౌంటర్ టాప్స్‌పై పెట్టి ఘనీభవించిన పదార్థాల్ని అస్సలు కరిగించకూడదు. నీటిలో/మైక్రోవేవ్ ఒవెన్‌లో పెట్టి కరిగించడం సురక్షితం.
- సూప్స్, ఇతర కూరల్ని (కాయగూరలు లేదా ఇతర మాంసాహారం కలిపి తయారుచేసినా) మూడు నాలుగు రోజుల వరకు ఫ్రిజ్‌లో నిల్వ చేయచ్చు.
- మిగిలిపోయిన ఆహార పదార్థాలు (మాంసం, పౌల్ట్రీ, చికెన్ నగెట్స్/ప్యాటీస్, పిజ్జా.. వంటివి) ఫ్రిజ్‌లో మూడునాలుగు రోజులు ఉంచచ్చు. అలాగని అన్ని పదార్ధాలను రోజుల తరబడి ఫ్రీజర్‌లో పెట్టి ఎప్పుడో వినియోగించడం కరక్ట్ కాదు.
- సాధ్యమైనంతవరకు మనం తీసుకునే ఆహార పదార్థాల్ని తాజాగా, పరిశుభ్రంగా, అప్పటికప్పుడు వండుకొని, వేడివేడిగా తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి వీలైనంతవరకు మిగిలిపోయిన అన్ని పదార్థాలనీ ఫ్రిజ్‌లో తోసేయకుండా జాగ్రత్త పడడం మంచిది.