Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉరుకుపరుగుల జీవితంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బరువు తగ్గడం అనేది ఒక సవాలుగా మారింది. పనిలో బిజీగా ఉండేవారు ఆకలిగా అనిపించినప్పుడు అనారోగ్యకరమైన వాటిని తింటారు. అలాంటి వారు.. సాబుదానా తీసుకోని సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. సాబుదానాలో ప్రొటీన్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీనితో పాటు క్యాలరీల పరిమాణం కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో సాబుదాన బరువు తగ్గడానికి, అలాగే ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
- బరువు తగ్గడానికి ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే సాబుదానా తినండి. చాలా సార్లు మనం బరువు తగ్గే క్రమంలో ప్రోటీన్లను ఆహారంలో చేర్చుకోలేకపోతున్నాం. దాంతో బరువు తగ్గిన తర్వాత లోపల నుంచి మనల్ని బలహీనంగా చేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆహారంలో సాబుదానాను చేర్చుకుంటే.. ఆరోగ్యకరమైన మార్గంలో బరువు తగ్గవచ్చని సూచిస్తున్నారు.
- బరువు తగ్గేటప్పుడు చాలా మంది కడుపులో కొన్ని రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో సాబుదానా తీసుకుంటే మలబద్ధకం సమస్య దూరమవుతుంది. దీని కోసం సాబుదాన గంజి లేదా ఖిచిడిని చేసుకొని తినవచ్చు. అదే సమయంలో ఇందులో ఉండే ఫైబర్ బలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది.
- సాబుదానా తినడం వల్ల పదే పదే ఆహారం తినాలనే కోరికను నియంత్రించుకోవచ్చు. ఎందుకంటే ఇవి రోజంతా శక్తితో నిండిన అనుభూతిని కలిగిస్తాయి. ఇందులో ఉండే క్యాలరీలు పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి. దీని వల్ల ఇతర ఆహారం తినకుండా నియంత్రించుకోగలుగుతారు. దాంతో ఊబకాయం కూడా తగ్గుతుంది.
- దీనితో చేసిన ఖిచిడీని తీసుకోవడం మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం, ఐరన్ షుగర్ లెవెల్‌ను అదుపులో ఉంచుతాయి.