Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరు ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వారిలో దిగులుగా ఉంటారు. వారి ముఖంలో మచ్చుకైనా ఆనంద కనిపించదు. అలాంటి వారు ఇతరులకు సాయం చేయండి. అందులో ఎంతో ఆనందం ఉంటుంది. ఇలా సాయం చేయడం, అందరితోనూ దయగా మెలగడం వల్ల మన శరీరంలో ఆక్సిటోసిన్ హార్మోన్లు విడుదలై సంతోషంగా ఉంటామని పరిశోధనలు చెబుతున్నాయి.
- అన్ని విషయాలు మనం అనుకున్నట్లే జరగాలనీ, అందరినీ సంతృప్తి పరచాలనీ అనుకోవద్దు. పరిస్థితులు ఎలా ఉన్నా మన పరిధిలో ఉన్న విషయాల మీదే దృష్టి సారించాలి. అప్పుడు ఒత్తిడికి లోనవకుండా ఆనందంగా ఉండగలం.
- రోజూ వారీ పనులు, బాధ్యతల్లో ఒకదానికొకటి మిళితం చేయకుండా మనకు సంతోషాన్నిచ్చే ఏదో ఒక పని కోసం నిత్యం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. పాటలు పాడటం, డ్యాన్స్ వేయడం, వయొలిన్ వాయించడం, చిత్రలేఖనం, ఆటలు ఇలా ఏదో ఒక పనిలో భాగస్వాములవ్వాలి.
- రోజూ నవ్వడానికి ప్రయత్నించాలి. నవ్వినప్పుడే వర్తమాన జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించగలం.
- మంచి లేదా చెడు దేన్నైనా సమానంగా స్వీకరించాలి. ప్రతి విషయాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే ప్రయోజనం ఉండదు.
- జీవితంలో మనం పొందిన ప్రతి ఒక్క దానికి కృతజ్ఞతా భావంతో ఉండాలి. నిరాశా నిస్పృహలు దరిచేరినప్పుడు మనం ఏమేం పొందామో తలచుకొని సంతోషంగా ఉండగలగాలి.
- అసలు వ్యాయామం చేయని వాళ్లకంటే రోజులో కనీసం పది నిమిషాల పాటు కసరత్తులు చేసేవాళ్లు ఎక్కువ సంతోషంగా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి మీ దినచర్యలో వ్యాపామాన్ని భాగం చేసుకోండి.