Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి మనుగడ ప్రారంభమై వేల ఏండ్లు గడుస్తుంది... అయినా ఆ పుట్టకకు కారణమవుతున్న రుతుస్రావం మాత్రం అశుద్ధంగానే పరిగణించబడుతుంది. ఆ సమయంలో ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలోని అమ్మాయిలు అంటరాని వారిగా బతుకుతున్నారు. ఆ వివక్షకు సజీవ సాక్షమే ఈ కథనం. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని మహిళలు రుతుస్రావం, ప్రసవ సమయంలో అనుభవిస్తున్న వివక్ష, కష్టాలను మన కండ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఆ
వివరాలేంటో మనమూ తెలుసుకుందాం...
గ్రామీణ భారతదేశంలోని కౌమారదశలో ఉన్న బాలికలు, యువతులపై PARI, , కౌంటర్మీడియా ట్రస్ట్ కలిసి దేశవ్యాప్తంగా ఓ సర్వేను చేపట్టారు. ఆ ప్రాజెక్ట్‌లో భాగంగా పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సహకారంతో ఈ కథనం సేకరించబడింది. ఈ సర్వే ద్వారా ఇంకా అట్టడుగున ఉన్న ఎన్నో సమూహాలు పునరుత్పత్తి, లైంగిక ఆరోగ్యం, మహిళల హక్కుల పరిస్థితి, జీవన అనుభవాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
రెండు వేర్వేరు ప్రపంచాలు
పర్వత రాష్ట్రంగా పిలవబడే ఉత్తరాఖండ్‌లోని రాజ్‌పుత్ కమ్యూనిటీకి చెందిన ప్రియా 16 ఏండ్ల విద్యార్థిని. రుతుస్రావం సమయంలో తను అనుసరించాల్సిన కఠినమైన, నిర్దేశించిన నియమాల గురించి మాట్లాడుతూ ''ఇది మాకు రెండు వేర్వేరు ప్రపంచాలలో జీవించడం లాంటిది. ఇంట్లో ఉన్నప్పుడు ఒంట రిగా ఉండాలి, అన్ని ఆచా రాలు, ఆంక్షలను పాటిం చాలి. కానీ పాఠశాలలో మాత్రం స్త్రీలు పురుషులతో సమానమని బోధిస్తారు. అంటే నేను పాఠశాలలో ఏది నేర్చుకున్నా, అది నా ఇంటిలోని వాస్తవికతకు వ్యతిరేకం'' అని ఆమె చెప్పింది.
కుటుంబాన్ని ఒప్పించలేకపోయాను
ఇంటర్ చదువుతున్న ప్రియా పాఠశాల తన గ్రామంలోని ఏడు కిలోమీటర్ల దూరంలో నానక్‌మట్ట పట్టణంలో ఉంది. ప్రతిరోజూ సైకిల్‌పై అక్కడికి వెళ్లి వస్తుంది. తెలివైన విద్యార్థిని అయిన ఆమె మొదట్లో ఈ అంశంపై తనకు తానుగా అవగాహన కల్పించుకోవడానికి ప్రయత్నించింది. ''నేను దీని గురించి ఎన్నో పుస్తకాలు చదివాను, కానీ ఈ ఆచారాలకు అర్థం లేదని నా కుటుంబాన్ని ఒప్పించలేకపోయాను. 24 గంటలు వారితో జీవిస్తున్నాను. కానీ ఈ పరిమితుల గురించి వారికి అర్థం చేయించలేకపోతున్నాను'' అంటుంది.
నా గదికే పరిమితం
ప్రియా ఇంటి పక్కనే ఉన్న మరొక రాజపుత్ర కుటుంబానికి చెందిన విధా రుతుస్రావంలో ఉన్నప్పుడు తన జీవన విధానాన్ని వివరిస్తూ ''రాబోయే ఆరు రోజులు నేను నా గదికే పరిమితమై ఉంటాను. అమ్మ, నాన్నమ్మ నన్ను ఇంట్లో తిరగొద్దని చెప్పారు. నాకు కావాల్సినవి మా అమ్మ తెచ్చిపెడుతుంది'' అని చెప్పింది. ఆమె గదిలో రెండు పడకలు, డ్రెస్సింగ్ టేబుల్, అల్మారా ఉన్నాయి. 15 ఏండ్ల విధా సాధారణ చెక్క మంచం మీద పడు కోలేదు. దాని వల్ల తనకు వెన్నునొప్పి వస్తుందని ఆమె చెప్పింది. కానీ ఆమె తన కుటుంబ మనశ్శాంతి'' కోసం అలా చేస్తుంది.
ఎవరూ కాదనలేని ప్రజా జ్ఞానం
ఈ నిర్బంధించబడిన ఐసోలేషన్ సమయం లో విధా పాఠశాలకు వెళ్ళొచ్చు. అయితే సితార్ గంజ్ బ్లాక్‌లోని నాగలా గ్రామంలోని ఆమె ఇంటి లోని ఈ గదికి నేరుగా తిరిగి రావాలి. ఆమె తల్లి ఫోన్, అవసరమైన పుస్తకాలు మాత్రం ఆమెతో ఉంటాయి. ఒక స్త్రీ తన కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ, తన వస్తువులను వేరుగా ఉంచుకుంటుంది అంటే అది ఆమె రుతుస్రావం అని అందరికీ సంకేతం. రజస్వల అనేది ఎవరూ కాదనలేని ప్రజా జ్ఞానమని విధా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ''అందరూ దీని గురించి తెలుసుకుంటారు, చర్చిస్తారు. రుతుక్రమంలో ఉన్న వ్యక్తి జంతువులను, పండ్ల చెట్లను తాకకూడదు, ఆహారం వండడానికి, వడ్డించడానికి, ఆలయం నుండి ప్రసాదాలను స్వీకరించడానికి కూడా అనుమతించబడదు'' అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది.
దాని కోసమే నాలుగు ఆవులు
విధా తండ్రి సైన్యంలో ఉన్నారు. ఆమె తల్లి 13 మంది ఉన్న ఇంటిని చూసుకుంటుంది. ఇంత పెద్ద కుటుంబం ఉన్నా ఒంటరిగా ఉండటం ఆమెకు ఇబ్బందికరంగా ఉంది. దీని గురించి ఆమె తన అన్నదమ్ములకు చెప్పే ప్రయత్నం చేస్తే ''ఇది ఒక అనారోగ్యం. అందుకే మీరు ఇంట్లో వారికి దూరంగా ఉంటున్నారు'' అంటారు. ఎవరైనా ఆమెను తెలియకుండా తాకితే వారు కూడా అపవిత్రులుగా పరిగణించబడతారు. వారిపై కూడా గోమూత్రాన్ని పిచికారీ చేసి శుభ్రం చేస్తారు. ఆ ఆరు రోజులల్లో విధాతో సంబంధం ఉన్న ప్రతి దానిపై గోమూత్రాన్ని చల్లుతారు. వారి ఇంట్లో నాలుగు ఆవులు ఉండడంతో వాటి మూత్రం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. సంఘం తర్వాత కొన్ని పద్ధతులను సడలించింది, అయితే స్వల్పంగా మాత్రమే. దాంతో 2022లో విధాకు పడుకోవడానికి ప్రత్యేక మంచం దొరికింది.
ఒక్కోసారి మర్చిపోయేవారు
అదే గ్రామానికి చెందిన 70 ఏండ్ల బీనా రుతుస్రావం అయినప్పుడు తాను పశువుల పాకలో ఎలా ఉండాల్సి వచ్చిందో వివరిస్తుంది. ''మేము కూర్చోవడానికి నేలపై పైన్ ఆకులను వేసేవారు'' అంటూ గుర్తుచేసుకుంది. మరొక పెద్ద వయసు మహిళ మాట్లాడుతూ ''నాకు నూనెలోని రోటీలతో పాటు, చక్కెర లేని చారు ఇచ్చేవారు. లేదంటే జంతువులకు పెట్టే ముతక ధాన్యంతో చేసిన రోటీలు పెట్టేవారు. కొన్ని సమయాల్లో అయితే మా గురించి మరచిపోయేవారు. దాంతో మేము ఆకలితో అలమటించే వాళ్ళము'' అన్నారు.
సహజమైన ప్రక్రియ
29 ఏండ్ల యువకుడు తన భార్యతో కలిసి నానక్‌మట్ట పట్టణంలోని అద్దె గదిలో నివసిస్తున్నాడు. ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాకు చెందిన అతను పదేండ్ల నుండి ప్రైవేట్ పాఠశాలలో బోధించడం ప్రారంభించాడు. ''రుతుస్రావం అనేది సహజమైన ప్రక్రియ అని మాకు ఎప్పుడూ చెప్పలేదు. చిన్నతనం నుండే మనం ఈ ఆంక్షలను పాటించడం మానేస్తే, మగవారు ఏ అమ్మాయికి లేదా స్త్రీకి రుతుక్రమం వచ్చినప్పుడు చిన్నచూపు చూడరు'' అని ఆయన చెప్పారు.
కొనడం, పారవేయడం ఓ సవాల్
శానిటరీ ప్యాడ్లను కొనుగోలు చేయడం, పారవేయడం అక్కడ ఓ సవాలు. గ్రామంలోని దుకాణంలో ఒక్కోసారి అవి దొరుకుతాయి. కొన్ని సందర్భాల్లో దొరకవు. యువతులు వచ్చి దుకాణదారుడిని ప్యాడ్స్ కోసం అడిగితే వారు తమని వింతగా చూస్తున్నారని చెప్పారు. వాటిని కొన్న తర్వాత ఎవరి కంటికీ కన బడకుండా రహస్యంగా దాచి తీసుకువెళ్ళాలి. ఇక ఆ ప్యాడ్లను పారవేయడం 500 మీటర్ల దూరంలో ఉన్న కాలువ వరకు నడిచి వెళ్ళాలి. అది కూడా తాము అటుగా వెళ్ళడం ఎవరూ చూడకుండా జాగ్రత్త పడాలి.
ప్రసవం తర్వాత మరీ ఒంటరితనం
'అశుద్ధం' అనే ఆలోచన అప్పుడే పుట్టిన బిడ్డలపై కూడా ఉంటుంది. లతాకు యుక్తవయసులోనే పిల్లలు పుట్టారు. ఆమె అప్పటి సమయాన్ని బాగా గుర్తుంచుకుంటూ ''రుతుక్రమం సమయంలో నాలుగు నుండి ఆరు రోజులు మాత్రమే ఒంటరిగా ఉండేవాళ్ళం. అయితే కొత్తగా తల్లి అయిన వారు 11 రోజుల పాటు ఇంటికి దూరంగా ఉండాలి. కొన్నిసార్లు ఇది 15 రోజులు కూడా పట్టొచ్చు. అంటే పిల్లల నామకరణ కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా ఉండవచ్చు. లత ప్రస్తుతం 15 ఏండ్ల అమ్మాయి, 12 ఏండ్ల అబ్బాయికి తల్లి. కొత్త తల్లి పడుకునే మంచాన్ని గుర్తించడానికి ఆవు పేడతో గీత గీసే వారిని గుర్తు చేసుకుంది.
అప్పుడే పుట్టిన బిడ్డను కూడా...
అప్పుడే పుట్టిన బిడ్డ ఉన్న కుటుంబం చేతిలోంచి గ్లాసు నీళ్ళు కూడా ఊరిలో ఎవరూ స్వీకరించరు. మొత్తం కుటుంబం 'అపవిత్రమైనది'గా పరిగణించబడుతుంది. స్త్రీని లేదా నవజాత శిశువును తాకిన ఎవరైనా గోమూత్రాన్ని చల్లని తర్వాత శుద్ధి అవుతారు. సాధారణంగా పదకొండవ రోజున స్త్రీ, శిశువును స్నానం చేయించి గోమూత్రంతో కడుగుతారు.
ఆచారాలే ముఖ్యం...
గ్రామంలోని నరేందర్ అనే ఒక పెద్దాయనతో మాట్లాడితే ''ఉత్తరాం చల్, ఉత్తరాఖండ్ పాత పేరు దేవ తల నివాసం. కాబట్టి ఆచారాలు ఇక్కడ ముఖ్యమైనవి'' అని చెప్పాడు. తమ కమ్యూనిటీలోని అమ్మాయిలు 9-10 ఏండ్ల వయసు లో వారికి రుతుక్రమం రాకముందే పెండ్లి చేసేవారని ఆయన చెప్పారు. ''ఆమెకు రుతుక్రమం ప్రారంభమైతే మనం కన్యాదానం ఎలా చేస్తాం?'' అంటూ అతను ఒక అమ్మాయిని తన భర్తకు బహుమతిగా ఇచ్చే వైవాహిక ఆచారం గురించి మాట్లాడుతూ చెప్పాడు. ''ఇప్పుడు ప్రభుత్వం వివాహ వయసును 21కి మార్చింది. అప్పటి నుండి ప్రభుత్వానికి, మాకు వేర్వేరు నియమాలు ఉన్నాయి'' అంటున్నాడు.
గోమూత్రం చల్లితే చాలు
మహిళలను రుతుస్రావాన్ని 'అపవిత్రం' అని ప్రచారం చేస్తున్న ఈ దృక్పథం ఉధమ్ సింగ్ నగర్ జనాభాలో ప్రతిబింబిస్తుంది. అమ్మాయిల పట్ల చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది. విధా మంచం కింద ఒక ప్లేటు, ఒక గిన్నె, స్టీల్ టంబ్లర్, చెంచా ఉంటాయి. ఈ సమయంలో తినడానికి ఆమె తప్పనిసరిగా అవే ఉపయోగించాలి. నాల్గవ రోజు ఈ పాత్రలను ఎండలో కడిగి ఆరబెట్టడానికి ఆమె త్వరగా మేల్కొంటుంది. ''నేను కడిగి ఎండలో ఆరబెట్టిన ఆ గిన్నెలపై మా అమ్మ గోమూత్రాన్ని చల్లి వాటిని మళ్లీ కడిగి వంటగదిలో ఉంచుతుంది. అలాగే ఆ రోజుల్లో ధరించడానికి మా అమ్మ నాకు రెండు జతల బట్టలు ఇస్తుంది. వాటిని ఉతికి ఇంటి వెనక భాగంలో దూరంగా ఆరబెట్టాలి. ఇతర బట్టలతో వాటిని కలపకూడదు'' అంటూ ఆమె అనుసరిస్తున్న విధానాలను వివరిస్తుంది.
అమ్మ అంటరానిదయింది
చాలా మంది స్త్రీలు, పురుషులు ఈ పద్ధతులు మత గ్రంథాలలో నిర్దేశించబడి ఉన్నాయని, వాటిని ప్రశ్నించ లేమని నమ్ముతారు. కొంతమంది మహిళలు ఇలా ఒంటరిగా ఉండడం తమకు ఇబ్బందిగా ఉందని, కానీ అలా వుండకపోతే దేవతలు అసంతృప్తి చెందుతారని అంటున్నారు. గ్రామంలో యువకుడైనా వినరు రుతుక్రమంలో ఉన్న స్త్రీలను చాలా అరుదుగా కలుసుకుంటానని చెప్పాడు. అతను పెద్దయ్యాక 'మమ్మీ అశుద్ హో గయీ హై (మమ్మీ ఇప్పుడు అంటరానిదిగా మారింది)' అనే మాటలను ఇంట్లో వినేవాడినని చెప్పాడు.