Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హలో.. నమస్తే శ్రీవిద్య.. మా పిల్లలకు చదివి చెప్పేందుకు మంచి పుస్తకాలు కావాలండీ. మా చిరునామా పంపిస్తానండీ. అయితే అంతకన్న ముందు మీవంటి మేధోసంపదతో మాట్లాడటానికి ఓ పది నిముషాలు అంగీకరించారు చాలా కృతజ్ఞతలు...
మీరు పిల్లలకోసం వివిధ గ్రంధాలలో నుంచి సేకరించిన అమూల్యమైన విషయాలను కథలుగా రూపొందించి అందజేస్తున్నారంట. అసలు అంతటి గొప్ప ఆలోచన మీకు ఎలా తట్టింది. ఓహౌ... మీ పిల్లలకోసం మీ మేధస్సులో మెరిసిందా.. ఒక గృహిణీగా ఒకతల్లిగా బాధ్యతలు ఉన్నప్పటికీ మీ పిల్లల్లాంటి ఎందరో బిడ్డల కోసం ఇంత అపూర్వ సంపద సమకూర్చుతున్నారన్నమాట.. శభాష్
ఓV్‌ా... ఔనా తొలిగా మన తెలుగింటి పండుగలైన దీపావళి సంక్రాంతి గురించే పుస్తకాలు ప్రచురించారా..! వావ్... ఏంటీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. దాన్ని ఆవిష్కరించారా..! అదిగో మా అబ్బాయి చెబుతున్నాడు మీ పుస్తకాలు అల్లు ఆర్జున్ పిల్లలు కోరి తెప్పించుకున్నారట. ఒక ఘనతను మించిన ఘనత.. మరొకటీ.. మీతో మాట్లాడుతుంటే ఆనందం ఆశ్చర్యం ఉప్పొంగుతున్నాయి.
ఏంటీ స్వప్నా దత్ కూడా కోరి మరీ పొందారా.. ఆహా అంతర్జాల మాధ్యమాల్లో కూడా ఉంచారా..! అక్షర కిరణాలు ప్రసరించే పశ్చిమ సూర్యునిలా మీరు విదేశంలో ఉంటూ మన భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల గ్రంధ విశేషాలను ఇలా పంచటం ఒక బృహత్తరసత్కార్యం. పుస్తకం, పఠనం అనే శుభ లక్షణాలు కొరవడుతున్నాయని నిత్యం ఆవేదన చెందే నాలాంటి పుస్తక ప్రేమికుల వేదనకు ఎంత చక్కని వెన్నెలమలాము అద్దారండి. నిజంగా మీ కృషి ప్రసంశనీయం, ప్రశస్తం.
ఈ రంగంలో మీ నిత్య కృషికి పురస్కారాలు సైతం మిమ్మల్ని చేరి సార్ధకత పొంది ఉంటాయి అనుకుంటా వాటివివరాలూ... ఓV్‌ా స్వీయ పుస్తక కేటగిరిలో బిజినెస్ మింట్ పురస్కారం పొందారన్నమాట. హృదయపూర్వక అభినందనలు. ఈ పుస్తకాలు ప్రచురణా ఇదంతా.. ఎలా? ఓ ఔనా ప్రచురణ కర్తలు, దిద్దుబాట్లు చేసేవారూ, ముఖచిత్రరూపకర్తలు అందరూ ఇంటి నుంచే పని చేస్తారా. చాలా బాగుంది విద్య. ఈ సేనతో లోకానికి జ్ఞాన వికాసం కలిగిస్తున్న యోధ మీరు. ఇంతటి గొప్ప సంపద అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో తెలుసుకోవచ్చా..?
ఆహా.. విమానాశ్రయాలలో వాణిజ్య సముదాయాలలో లభ్యమయ్యే విధంగానా బావుందండీ. Apic.com వ్యవస్థాపకురాలిగా మీ కృషి అద్భుతం. మీ మేధకు తోడు విరు హబ్ సహకారంతో అశేష తెలుగు ప్రజలకు ఉపయోగపడేలా గొప్ప పని చేస్తున్నారు. మీ అసాధారణ మేధో సంపదతో మహిళాశక్తిని మహోన్నతంగ చాటుతున్నారు. విద్యే అసలైన సంపద అని ప్రపంచానికి చాటి చెబుతున్న మీరు మరిన్ని విజయాలు సాధించాలి.
- డా.కోడూరు సుమనశ్రీ 9490401968