Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పర్యాటక ప్రాంతాలు, కొత్త ప్రదేశాలు చుట్టి రావాలి.. ప్రకృతిలో గడపాలని అనుకునేవారికి వేసవి సరైన సమయం. అయితే ఒంటరిగా వెళ్లాలనుకుంటున్నారా? కొన్ని చిట్కాలు అవసరం అంటున్నారు నిపుణులు.
ఎంచుకున్న ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను ముందుగానే తెలుసుకోవాలి. దూర ప్రాంతాలకు ప్రయాణించినా సౌకర్యవంతంగా ఉండేలా వస్త్రాలకు ప్రాధాన్యమివ్వాలి. పర్వతారోహణ, ఈత వంటివి ఏం చేయాలనుకున్నా తగ్గవి తీసుకెళ్లాలి.
పర్యటించే ప్రాంతాల్లోని ప్రత్యేక వంటకాలను రుచి చూడొచ్చు. అయితే ఎంత రుచిగా ఉన్నా నియం త్రణ తప్పదు. ఇంకా పోషకాలు అందుతున్నాయో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఎండలకు డీహైడ్రేట్ కాకుండా నీరు, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి. చర్మ పరిరక్షణకీ ప్రాధాన్యమివ్వాలి.
ఆనందంలో పడి అప్రమత్తత మరవొద్దు. పరిసర ప్రాంతాలను నిత్యం గమనించుకోవాలి. తెలియని ప్రాంతంలో రాత్రిళ్లు ఒంటరిగా తిరగొద్దు. అత్యవసర నంబర్లనూ సేకరించుకుంటే ఇంకా మంచిది. అపరిచితుల సాయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.
ప్రభుత్వ రవాణాకే ప్రాధాన్యతనివ్వాలి. ఆ అవకాశం లేకపోతే యాప్స్‌లో రైడ్ షేరింగ్‌ను ఎంచుకోవచ్చు. వెళ్లబోయే ప్రాంతాల మ్యాప్‌లను సిద్ధం చేసుకుంటే ఎంత సమయం పడుతుందన్న వాటిపై అవగాహన ఉంటుంది. విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లొద్దు. ఇలా కాస్త జాగ్రత్తగా వెళితే మీ ప్రయాణం మధురమైన జ్ఞాపకంగా మారడం ఖాయం.