Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంత జాగ్రత్త తీసుకున్నా చర్మం పొడిబారటం, గరుకుచర్మం వంటి సమస్యలు ముఖంలో కళ లేకుండా చేస్తుంటాయి. అలాంటప్పుడు ఫేషియల్ ఆయిల్‌తో మర్దనా చేస్తే బోలెడన్ని ప్రయోజనాలు..
- ఫేషియల్ ఆయిల్స్‌లోని ఫ్యాటీ యాసిడ్స్ చర్మం మృదువుగా ఉండేందుకు దోహదపడతాయి. ముఖ్యంగా పొడి చర్మం ఉన్న వారిలో తేమను పదిలపరచి పొడిబారకుండా చేస్తుంది.
- వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మం పాడవకుండా చేస్తాయి. ముడతలు, మచ్చలు లేకుండా లేకుండా చేయటమే కాదు వృద్ధాప్య ఛాయలు కూడా రాకుండా చేస్తాయి.
- ఫేషియల్ ఆయిల్‌ని మేకప్ వేసుకునే ముందు ప్రైమర్‌లా కూడా రాసుకోవచ్చు. తర్వాత మేకప్ వేసుకుంటే మనం వాడే ఇతర సౌందర్య ఉత్పత్తులు చర్మంలోకి చొచ్చుకుపోయేలా చేసి మంచి ఫలితం వచ్చేలా చేస్తుంది. ఈ నూనెలు చర్మాన్ని నునుపుగా చేసి మోము కాంతులీనేలా చేయగలవు.