Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం రోజు వంటల్లో వాడే పదార్ధాలు, ఆకుకూరలు, కూరగాయలలోని పోషకాలే చాలా రోగాలు నయం చేస్తాయి. అలాంటి పోషక విలువలు ఉన్నవాటిలో మునగది ప్రత్యేకస్థానం. ఇది మూడువందల రకాల రోగాలను దూరం చేస్తుందట. అందుకే మునగాకును పోషకాల గని అనడంలో అతిశయోక్తి లేదు.
100 గ్రాముల మునగాకులో ఉండే పోషక పదార్థాలను గమనిస్తే..
ఇందులో 6.7గ్రాముల ప్రోటీన్స్, 13.4 గ్రాముల పిండిపదార్థాలు ఉంటాయి. మన శరీరానికి కావల్సిన కాల్షియం 440 మిల్లి గ్రాములు, ఐరన్ 200 మిల్లి గ్రాములు, ఇతర సూక్ష్మపోషకాలు 2.3 శాతం ఉంటాయి. వంద గ్రాముల మునగాకు తీసుకుంటే 97 క్యాలరీల శక్తి లభిస్తుంది. మరి ఇన్ని పోషకాలున్న మునగను రోజు ఆహారంలో తీసుకుంటే కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి.
మనం రోజు తాగే పాలలో ఉండే కాల్షియం మునగాకులో 17 రేట్లు ఎక్కువగా ఉంటుంది
పెరుగులో ఉండే ప్రోటీన్స్ కంటే 8 రేట్లు ఎక్కువగా మునగాకులో ఉంటాయి.
మునగాకులో అరటి పండులో ఉండే ప్రోటీన్స్ కంటే 15 రేట్లు ఎక్కువగా ఉంటాయి.
బ్లడ్‌లోని షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చెయ్యడానికి మునగలోని క్లోరోజెనిక్ ఎంతో
ఉపయోగపడుతుంది.
ప్రాణాంతకమైన క్యాన్సర్స్ ని తగ్గించే శక్తి మునగాకుకి ఉంది. రి