Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు వయసు మీద పడినప్పుడే వెంట్రుకలు తెల్లబడేవి. ఇప్పుడు రకరకాల ఆరోగ్య సమస్యలు, కాలుష్యం, జీవనశైలి వంటి వాటి వల్ల త్వరగా తెల్లజుత్తు వచ్చేస్తోంది. యుక్త వయసులో వృద్ధాప్య ఛాయల్ని భరించడం ఎవరికైనా కష్టమే. అలాంటి వారి కోసమే ఈ చిట్కాలు.
గోరింటాకుని రుబ్బి అందులో మూడు చెంచాల ఉసిరిక పొడి, ఒక చెంచా కాఫీ పొడి, పెరుగు కలిపి కుదుళ్లకు, జుట్టుకు బాగా పట్టించండి. ఆరిన తర్వాత కుంకుడు రసంతో తలంటుకోండి. వారినికి ఒకట్రెండుసార్లు ఇలా చేయండి.
బ్లాక్‌టీలో ఉప్పు కలిపి అప్పుడప్పుడూ జుట్టు కడుగుతూ ఉంటే నల్లబడుతుంది.
గోరింటాకు, మందార ఆకులు, కరివేపాకుల్ని సమసాళ్లలో తీసుకుని మెత్తగా రుబ్బాలి. దీన్ని తలకు పట్టించి, ఆరిన తర్వాత మైల్డ్ షాంపూతో తలంటుకుంటే ఫలితం ఉంటుంది.
తులసి ఆకుల్ని నీటిలో మరగించాలి. ఇవి గోరువెచ్చగా అయ్యే వరకూ చల్లార్చి, ఆ నీటితో కుదుళ్ళకు బాగా మసాజ్ చేస్తే మంచిది.
ఉసిరిపొడిలో నిమ్మరసం కలిపి కాసేపు పక్కన పెట్టాలి. తర్వాత దీన్ని కుదుళ్లకు పట్టించి అరగంట పాటు వదిలేయాలి. తరువాత కుంకుడు రసంతో కానీ షీకాయ పొడితో కానీ తలంటుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే సమస్య తీరిపోతుంది.
రెండు చెంచాల గోరింటాకు పొడి, రెండు చెంచాల మెంతి పొడి, చెంచాడు పెరుగు, చెంచాడు కాఫీ పొడి, రెండు చెంచాల పుదీనా రసం, రెండు చెంచాల తులసి రసం కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని కుదుళ్లకు, జుట్టుకు బాగా పట్టించి తలకు ఏదైనా బట్ట చుట్టేయాలి. అరగంట నుంచి నలభై అయిదు నిమిషాలు అలాగే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే బాలనెరుపు పోయి జుట్టు నల్లబడుతుంది.