Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలకూర రోజూ తినటం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో ఫైబర్, విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి అధిక రక్త పోటును తగ్గిస్తాయి. పాలకూరలోని ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరుపును దూరం చేస్తాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పాలకూరలో పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పని చేస్తాయి. విటమిన్ కె, సి, మెగ్నీషియం, ఫొలిక్ యాసిడ్, కాల్షియం, సోడియం, ఐరన్, ప్రోటీన్లు, బీటా కెరోటిన్, బి కాంప్లెక్స్ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. పలు రకాల క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. గుండె సంబంధిత వ్యాదులు రాకుండా కాపాడుతుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణం, రోగ నిరోధక శక్తిని పెంచే గుణాన్ని కలిగి ఉంటుంది.