Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్కువ శాతం అమ్మాయిలు విటమిన్ 'బి12' లోపంతో బాధపడుతున్నారని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. కొంత దూరం కూడా నడవలేరు, చిన్న పని చేసినా అలసిపోతారు, నీరసంగా కనిపిస్తారు. దీనికి ప్రధాన కారణం విటమిన్ 'బి12'. ఇది లోపిస్తే చాలు వ్యాధి నిరోధక శక్తి తగ్గి, క్రమంగా బలహీనపడతారు. విటమిన్ 'బి12' లోపిస్తే శరీరంలో జరిగే మార్పులను గురించి తెలుసుకుందాం...!
విటమిన్ 'బి12' లోపం వల్ల రక్తహీనత(ఎనీమియా) వస్తుంది. విటమిన్ బి12లో ఉండే విటమిన్లు ముఖ్యంగా ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి. అలాగే ఈ రక్త కణాలు ఆక్సిజన్ సరఫరాలో కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో ఆక్సిజన్ సరఫరా ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు దేహం బలహీనపడుతుంది. అంటే కణాల పని విధానంలో తేడా వస్తుంది. ఈ మొత్తం ప్రభావం నరాల, మెదడు మీద పడుతుంది.
పాలు, మంసం, వెన్న, గుడ్లు వంటి వాటిలో విటమిన్ 'బి12' పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. విటమిన్ 'బి12' లోపంతో బాధపడే వారు ఈ పదార్థాలను తీసుకోవడం తొందరగా కోలుకుంటారు.
అలాగే బి12 లోపం వల్ల జీర్ణక్రియ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి.
దీనివల్ల ప్రధానంగా అజీర్తి సమస్యలు, జ్వరం వంటి సమస్యలు వేధిస్తాయి. క్రమంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గి శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. చిన్నపేగుకు చెందిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. ముఖ్యంగా అమ్మాయిలు విటమిన్ 'బి12' చాలా అవసరం. కాబట్టి ప్రతిరోజూ ఆహారంలో విటమిన్లు ఉండే పై పదార్థాలను తీసుకోవడం మంచిది.