Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాన కాలపు సాయంత్రాలను ఆనందంగా ఆస్వాదించాలంటే ఇంటిని కాంతివంతంగా తీర్చిదిద్దుకుంటే సరిపోతుంది. కొన్ని సందర్భాల్లో మనసు మూడీగా ఉంటుంది. అలాంటి సమయంలో మనసు ఆహ్లాదభరితంగా ఉండాలంటే ఇల్లును డిఫరెంట్ డిజైన్లల్లో ఉండే క్యాండిల్స్ హౌల్డర్స్తో అలంకరించుకుంటే సరిపోతుంది. ఆ కాంతి వెలుగుల్లో మనసు ఉల్లాసంగా, ఆనందంగా ఉంటుంది. అలాంటి వెరైటీ క్యాండిల్ హౌల్డర్స్ ఈ వారం మీ కోసం...!
ఒకే క్యాండిల్ తో: ఎక్కువ వెలుగు లేకుండా ఒకే క్యాండిల్ ను క్యాండిల్ హౌల్డర్స్లో పెడితే ఎంతో అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం వివిధ రకాల డిజైన్లలో హౌల్డర్స్ లభిస్తున్నాయి. కొన్నింటిని చేతితో పట్టుకోవచ్చు. కింది భాగంలో పడిపోకుండా ఆధారం పటిష్టంగా ఉంటుంది. ఈ క్యాండిల్ హౌల్డర్ ను ఎక్కడికంటే అక్కడికి సులభంగా తీసుకెళ్లవచ్చు. క్యాండిల్స్ లైట్ డిన్నర్ చేయాలనుకున్నప్పుడు లైటింగ్ కోసం వీటిని అక్కడక్కడా ఉపయోగించుకుంటే సరిపోతుంది.
వెరైటీ క్యాండిల్ హౌల్డర్లు: 'క్యాండిలాబ్రా' హౌల్డర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ హౌల్డర్ చెట్టు ఆకారాన్ని పోలి ఉంటుంది. దీనిలో ఎక్కువ కొవ్వొత్తులు పెట్టుకుంటే సరిపోతుంది.
హుందాతనం కోసం: ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దే క్యాండిల్ హౌల్డర్స్ షాండ్లియర్లు కూడా ఒకటి. వీటిలో కూడా క్యాండిలాబ్రా హౌల్డర్లు లాగానే ఎక్కువ కొవ్వుత్తులు అమర్చుకొనే విధంగా శాఖలుంటాయి. వీటిని ఇంట్లో హల్లో పెట్టుకోవచ్చు.
లోహపు పాత్రలో: ఇనుము, గాజు, ప్లాస్టిక్, చెక్కవంటి పదార్థాలతో చేసిన పాత్రల్లో అమర్చిన క్యాండిళ్ళను టీలైట్ క్యాండిల్ హౌల్డర్లు అంటారు. ఇవి ఎత్తు తక్కువగా ఉండి, విశాలంగా ఉంటాయి. పైగా వీటిలో అమర్చిన క్యాండిల్ కరిగి అందులోనే పడడం వల్ల కొవ్వొత్తి ఎక్కువ రోజులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇవి చూడడానికి అందంగా, ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు వీటిని అక్కడక్కడా వల్ల ఇల్లంతా కొత్తగా కనిపిస్తుంది.
సంప్రదాయ కళ: ప్రత్యేకించి పండగ సమయాల్లో ఇంటి అందాన్ని పెంచడం కోసం కూడా ఎన్నో రకాల క్యాండిల్ హౌల్డర్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో బంగారం లేదా వెండితో తయారైనవి కూడా ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో కొవ్వొత్తులు వెలిగించడానికి వీలుగా ఉండే వీటిని గదిలో ఒక పక్కకు అమర్చిన టేబుల్ పై అలంకరించున్న సంప్రదాయబద్దంగా కనిపిస్తుంది.