Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సునీతా విలియమ్స్ (19సెప్టెంబర్ 1965)
సునీతా విలియమ్స్ పేరు వినగానే.. అంతరిక్షయానంలో ఆమె చేసిన సాహాసాలు గుర్తుకువచ్చిన ప్రతి మహిళ గర్వంగా ఫీల్ అవుతారు. ఆమె ప్రస్తుతం వ్యోమగాములకు శిక్షణ ఇస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిగా పనిచేసిన ఆమె నాసా వ్యోమగామి. రెండుసార్లు అంతరీక్షయానం చేయడంతో మూడుసార్లు స్పేస్ వాక్ , ఎక్కువ రోజులు(195రోజులు) అంతరిక్షంలో ఉన్న మహిళా వ్యోమగామిగా ప్రపంచరికార్డ్ సృష్టించారు. నాసా అధికార ప్రతినిధిగా ఆమె సేవలందిస్తున్నారు. సునీతా పూర్వీకులు భారతీయులు కావడంతో ఆమె 2007లో ఇండియాకు వచ్చారు.
సునీతా విలియమ్స్ యూక్లిడ్, ఒహియోలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు డాక్టర్ దీపక్ పాండ్య , బొన్నీ పాండ్య. దీపక్ పాండ్య తండ్రి, తాత భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. అందుకే ఆమె భారత సంతతిగా మనకు ఎంతో ఆదర్శనీయమయ్యారు.
సునీతా విలియమ్స్ మసచుసేట్స్ లోని నీధం హై స్కూల్ లో చదివారు. 1987లో యు.ఎస్. నావల్ అకాడమీ నుండి భౌతిక శాస్త్రంలో బి.ఎ. పట్టాను అందుకున్నారు. యుద్ధ విమాల పైలట్‌గా నియమితురాలైన ఆమె నావల్ టెస్ట్ పైలట్ స్కూలు నుంచి 1993లో డిగ్రీ పొందారు. ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1995లో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో ఎం.ఎస్సీ. పట్టాను అందుకున్నారు.
NASAలో చేరడం..
1998లో NASA కు ఎన్నికయ్యారు. పైలట్‌గా శిక్షణ పొందిన ఆమె వ్యోమనౌకలో పయనించడంతో పాటు నాసా అంతరిక్షంలో ఏర్పాటుచేసిన స్పేష్ స్టేషన్లోనూ పనిచేశారు. సునీత మాస్కో లోని రష్యన్ స్పేస్ ఏజన్సీలో ×ూూ రష్యా తరపున పనిచేశారు. చాలా మంది వ్యోమగాములులాగా, విలియమ్స్ కూడా అమెచూర్ రేడియో ఆపరేటర్ అనుమతి పొందారు.
అంతరిక్షయానం అనుభవం...
విలియమ్స్ STS-116 అంతర్జాతీయ అంతరిక్ష స్టేషనుకు డిస్కవరీ వ్యోమనౌకలో డిసెంబర్ 9, 2006లో పయనమయ్యారు. ఏప్రిల్ 2007లో తిరిగి భూమి మీదకు వచ్చారు. జనవరి 31, ఫిబ్రవరి 4, ఫిబ్రవరి 9 2007న మూడుసార్లు ఆమె అంతరిక్షంలో నడిచారు. ఏప్రిల్ 16 2007లో మొదటిసారిగా ఆమె వ్యోమగామిగా కక్ష్యలో పరిగెత్తారు. విలియమ్స్ 2007 బోస్టన్ మారథాన్‌ను నాలుగు గంటల 24 నిమిషాలలో పూర్తి చేశారు.విలియమ్స్ సోదరి దీనా పాండ్య మరియు తోటి వ్యోమగామి కారెన్ , నిబెర్గ్ భూమిమీద ఈ పరుగులో పాల్గొన్నారు. 2008లో విలియమ్స్ మరోసారి బోస్టన్ మారథాన్ లో పాల్గొన్నారు, ఈసారి భూమిమీద పరిగెత్తారు. రికార్డు స్థాయిలో విలియమ్స్ 195-రోజులు అంతరిక్షంలో గడిపి ఇంటికి వచ్చారు. విలియమ్స్ చీAూA డిప్యూటీ చీఫ్ ఆఫ్ ది ఆస్ట్రోనాట్ గా సేవలందించారు.
నింగిలోనే కాదు నీటిలోనూ ఆమె సాహసాలు చేశారు..నీమో2 సంస్థలో సభ్యత్వం పొందిన ఆమె నీటి అడుగుబాగంలో ఉండే ఆక్వాటిక్ తొమ్మిది రోజులు ఉన్నారు. రన్నింగ్, స్విమ్మింగ్, బైకింగ్, ట్రయాథ్లాన్, స్నోబోర్డింగ్, హంటింగ్ ఆమె అభిరుచులు.