Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలు అంతకుముందు ఆహారం ఎలా తీసుకున్నా ప్రెగెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్కెర, మసాలాలు, నూనెలు తక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
ప్లానింగ్ టైమ్లో పురుషులు లాప్టాప్ను ఒడిలో పెట్టుకుని పని చేయడం, మొబైల్ ప్యాంట్జేబులో ఉంచుకోవడం చేయకూడదు.
గర్భధారణ వేగంగా జరగడానికి పల్లెటూళ్ళలో ఇచ్చే నాటు మందులనూ, హెర్బల్ మందులంటూ లభ్యమయ్యే పొడుల వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఇలాంటివి ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీయవచ్చు.
సోయా ఉత్పాదనలను ఎక్కువగా తీసుకోకూడదు.
ప్రెగెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత దంపతులిద్దరూ మద్యపానం, పొగ తాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. టీ, కాఫీ వంటి పానీయాలను పరిమితంగా తీసుకోవాలి.
ప్రెగెన్సీ ప్లాన్ చేసుకున్న తొలినాళ్ళలోనే గర్భధారణ జరగకపోతే అంతలోనే నిరాశ వద్దు. కనీసం ఏడాదిపాటైనా ప్రయత్నించాక కూడా గర్భం రాకపోతే అప్పుడు డాక్టర్ను సంప్రదించాలి. ప