Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తళుకులీనుతున్న
దీపధూపాలతో
పూలరంగులు
సమ్మిళితమై
సాయంసంధ్యలో
సింగిడి పూసింది..
కరతాలధ్వనులు
కోలాటాలకోలాహలం
వరుసలుగా
కదులుతున్న
అడుగుల అందియల
మువ్వల సవ్వడి
తరుణుల
గళమాధుర్యాలైన
బతుకమ్మపాటల
ప్రవాహంతో
జతకలువగ
గాలి అలల
తాకిడికి
ఆవరణంతా
ప్రతిధ్వనించగ
చెట్టూ చేమ
పక్షి ప్రాణి
ప్రక తంతా
పులకించిపోగా
నీలాల
మేఘమాల
నేనుసైతమంటూ
ముచ్చటపడి
రతనాల మెరుపు
మెరిపించి
ముత్యాల జల్లు
కురిపించి
తన చేతుల్లో
ఎత్తుకుంది
ఆప్యాయంగా
బతుకమ్మను..
అల్లంతదూరాన
చుక్కలఅంబరం
తొడిగిన
వినీలాకాశంలో
కాంతులీనుతున్న
నెలవంక చంద్రమ
బతుకమ్మసిగలో
ఆభరణమై..
అపురూప
ద శ్యమాలిక..
పూలపండుగ
- మడిపల్లి హరిహరనాథ్
నిర్మల్ జిల్లా
9603577655