Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంధాలు కలిపేటి బతుకమ్మ పండుగ..
కలకాలము ఇలా వర్ధిల్లుమా..
ఆడ బిడ్డల నుదుట సింధూరమయ్యి..
బతుకమ్మ ఎదపైన గౌరమ్మ వై..
బతుకమ్మ గౌరమ్మ గంగమ్మ ఒడి చేర
ప్రతి తనువు ఆ క్షణము ఆనందమే..
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల పాటలే..
ప్రతి ఇంటి ముంగిట్లో రంగు రంగుల పూలే..
ఎలేలో ఏలేలో ఏలో ఎన్నియ్యాలో..
బతుకమ్మేగా మనకు బతుకును నేర్పింది..
పొద్దు పొడవకముందే లేచి..
అడవి తల్లి మల్లె తంగేడు పూ తెచ్చి..
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బతుకునియ్యాలమ్మ ఉయ్యాలో
తోడబుట్టిన అక్క చెల్లెళ్ళకు ఇచ్చి..
తోడు నీడగా నేను ఉంటాను అని చెప్పి
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బతుకునియ్యాలమ్మ ఉయ్యాలో
గ్రామానికి రక్షణ గ్రామదేవతలంట..
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఆడపిల్లను బతకనియ్యాలో.
ఈ పుడమికి రక్షణ ఆడపిల్లలంట..
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఆడపిల్లను బతకనియ్యాలో
బతుకమ్మ బతుకంటూ..
నూరేళ్ళు బతుకంటూ దీవించాలంట..
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఎదగనియ్యాలంట ఉయ్యాలో.
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో సదువనియ్యాలంట ఉయ్యాలో.
చాకలి ఐలమ్మ ఆడిందీ నేలా..
రాయే సెల్లమ్మ బతుకమ్మలాడా
వీరనారి రుద్రమ్మ రుద్రమ్మ ఏలిందీగడ్డా..
రాయే సెల్లమ్మ బతుకమ్మలాడా
మల్లు స్వరాజ్యమమ్మ ఆడుతున్న అడ్డా..
రాయే సెల్లమ్మ బతుకమ్మలాడా
- కోట మురళి
8498091416