Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్నీ ఉన్నా... జీవితంలో ఏదో కోల్పోతున్న అనుభూతి. అది తిరిగి పొందాలంటే ఇలా చేసి చూడండి. ఈరోజుల్లో ప్రేమ వ్యాపారంలా మారిపోయింది. అది కుటుంబ సభ్యుల వరకే పరిమితమైపోయింది. మనం అనుకున్నదానికంటే కాస్త భిన్నంగా జరిగినా... దాన్ని అసహ్యించడం మొదలుపెడుతున్నాం. కాబట్టి అందరినీ ప్రేమించండి. ద్వేషించడం మానేయండి.
చిన్న పిల్లలను మనం ఎందుకు ఇష్టపడతాం? ఎందుకంటే వాళ్లు ఎప్పుడూ చిరునవ్వులొలికిస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా నవ్వుతూ ఉండండి. ఆందోళనలతో అన్నీ బాగయిపోవు.
ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు చూడండి. ఎంత నష్టం జరుగుతుంది. తిరిగి వాటిని నిర్మించడం చాలా కష్టం. బంధాలు కూడా అలాంటివే. స్నేహంలో, ప్రేమలో ఏవైనా అపార్థాలు వచ్చినప్పుడు వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నించండి.
ఆఫీసులు కానివ్వండి... ఇంటిదగ్గర చుట్టుపక్కల కానివ్వండి. ఏ ముగ్గురు చేరినా ఇతరుల గురించి ఊసుపోని కబుర్లు. విమర్శలు, గాసిప్స్. గాసిప్స్‌ను వదిలేయండి. ఎవరైనా మంచి చేస్తే ప్రశంసించండి. దానివల్ల వచ్చే సానుకూల శక్తి అంతా ఇంతా కాదు.
ఎవరైనా ఏదైనా చిన్న తప్పు చేయగానే 'నువ్వు ఎప్పుడూ ఇలాగే చేస్తావు? ఎందుకిలా చేశావ్?' వంటి మాటలతో వాళ్ల మీద అరిచేస్తాం. అలా కాకుండా దానికి గల కారణాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాంటి తప్పులు చేయకుండా ఉండేందుకు సాయపడండి.
తీసుకోవడం కంటే ఇవ్వడం ఆనందంగా ఉంటుంది. అలాగని డబ్బులో, ధనమో ఇవ్వాల్సిన అవసరం లేదు. చిరునవ్వు, మంచి మాటలు, జ్ఞానం, నీకు కావాల్సినవాటికంటే ఎక్కువగా ఉన్నవి ఇచ్చేయండి. కావాల్సినవాళ్లు అవి పొందినప్పుడు వారి కళ్లల్లో ఆనందం, అంతా ఇంతా కాదు.