Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్ని చట్టాలున్నా, ఎంత మంది పోలీసులను ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు నియమించినా.. మహిళలపై దాడులు మాత్రం ఆగడం లేదు. మహిళలపై దాడుల వార్తలు దినపత్రికల్లో లేనిరోజు లేదంటే అతిశయోక్తికాదు. మరి ఈ దాడులు ఆగాలంటే ఏం చేయాలి? ప్రతి మహిళా తనను తాను రక్షించుకునేలా ఆత్మరక్షణ టెక్నిక్స్ నేర్చుకోవాలి. దాడులకు పాల్పడేవారిని తిప్పికొట్టాలి. అప్పుడే మహిళలు ధైర్యంగా బతకగలుగుతారు. మరి ఈ వారం మరో కొత్త టెక్నిక్ నేర్చుకుందామా!
సెల్ఫ్ డిఫెన్స్
అమ్మాయిలు తలవంచుకుని నడుస్తారు.. ఏం చేసినా ఎదిరించలేరు అన్న అభిప్రాయంతో మగవారు దాడులకు పాల్పడుతారు. ఆడవారు ఎదిరించడం ప్రారంభిస్తే..తమ చేతులకు పనిచెప్పితే మగవారు ఆమడదూరం పరిగెత్తాల్సిందే..!
చేతిలో ఆయుధంతో మహిళలపై దాడికి ప్రయత్నిస్తున్నాడు ఒక అగంతకుడు. వాడి చేతిలో కత్తి చూడగానే ఆమె ఒక క్షణం భయపడిపోయింది.
తనపై కత్తితో దాడి జరుగుతుందని గ్రహించిన మరుక్షణం ఎదురుదాడికి సిద్ధమైంది. తనవైపు దుసుకువస్తున్న కత్తి పట్టుకున్న అతడి చేయిని తన చేతితో అడ్డుకుంది.
కత్తిపట్టుకున్న చేతిని గట్టిగా పట్టుకుని వెనక్కి వంచింది. అగంతకుడి చేతిలో బలం తగ్గిపోగానే ఆమె కత్తిని తన చేతిలోకి తీసుకుంది. తనపై దాడిచేసే ప్రయత్నం చేసిన ఆ వ్యక్తి చేతిలోని ఆయుధం లాక్కోవడంతో పాటు తన ఎల్బోతో ఆ వ్యక్తి గొంతుకపై అటాక్ చేసింది. ఊహించని ఈ అటాక్‌తో అతడు విలవిలలాడిపోతాడు.
- ఎన్. లక్ష్మీ రవి,
ఇంటర్నెేషనల్ గోల్డ్ మెడలిస్ట్,
రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్,
గాంధీనగర్, హైదరాబాద్.
9490239170, 9949039049