Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీ బ్యాగులను ఉపయోగించిన తర్వాత వృథాగా బయట పడేస్తారు. అలా కాకుండా తిరిగి వాటి ద్వారా కొత్త ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చట. టీ బ్యాగులు మంచి యాంటీ ఆక్సిడెంట్స్‌గా పని చేస్తాయి.
పులిహౌర, బిర్యానీ, నూడుల్స్, పిస్తా చేసేటప్పుడు మంచి వాసన రావాలంటే ఇలా చేయండి! టీ బ్యాగులను నీటిలో వేసి బాగా మరిగించి బయటకు తీయాలి. ఇలా మరిగించిన నీటితో వంట చేసుకుంటే రుచి, వాసన అద్భుతంగా ఉంటాయి.
టీ బ్యాగులను ఉపయోగించిన తర్వాత పూల మొక్కలున్న కుండీల్లో వేయండి. ఇలా చేయడం వల్ల మొక్కలకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. టీ బ్యాగులను కుండీల్లో ఉండే మట్టితో బాగా కలపాలి. ఇవి మంచి ఎరువుగా పని చేసి మొక్క పెరుగుదలకు ఉపయోగపడతాయి.
పొడిగా ఉన్న టీ బ్యాగులను ప్రతిరోజు వేసుకునే షూలో వేయాలి. ఇలా చేయడం వల్ల వాటిలో ఉండే దుర్వాసన మాయం అవుతుంది.
అలాగే టీ బ్యాగులు మంచి దుర్గంధనాశనిగా పని చేస్తుంది. కార్పెట్స్కు ఉంటే కుట్టు వాసనను దూరం చేస్తాయి. గోరు వెచ్చటి నీటిలో టీ బ్యాగులను, నిమ్మరసాన్ని వేయాలి. ఈ నీటిలో కార్పెట్స్‌ను ఉతకడం వల్ల పర్ఫ్యూమ్ వాసన వస్తాయి.
గ్లాసు కిటికీలు, తలుపులను శుభ్రం చేయడంలో ప్రధాన ప్రాత పోషిస్తాయి. టీ బ్యాగులను మరిగించిన నీటిలో లింట్ క్లాత్‌ను ముంచి కిటికీలను, తలుపులను శుభ్రంగా తుడిస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల కొత్త వాటిలా తళ తళ మెరుస్తాయి.
చర్మం మీద ఉండే మృత కణాలను తొలగించడంలో టీ బ్యాగులు మంచి యాంటీ ఆక్సిడెంట్స్‌లా పని చేస్తాయి. ఒక బకెట్ గోరు వెచ్చటి నీటిలో టీ బ్యాగు వేసుకొని దాంట్లో పాదాలను 30 నిమిషాలు ఉంచడం వల్ల కండరాల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.