Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐయామ్ ఆల్సో బి హ్యాపీ అంటుంటారు చాలామంది. నిజానికి ఆ భావన ఉట్టి అబద్దం అంటున్నాయి కొన్ని పరిశోధనలు. పరిస్థితులకు అనుగుణంగా జీవించాల్సి వస్తుంది. కాబట్టి సందర్భానుసారంగా భావోద్వేగాలకు గురికావడం సహజం. మనసుకు సంతృప్తినిచ్చే ఆనందాన్ని పొందాలంటే కింది సూచనలను పాటిస్తే సరిపోతుంది.
కొన్ని పదాలు చిన్నగా కనిపించినా వాటి వల్ల కలిగే ఆనందం మాత్రం మనసుకు హాయినిస్తుంది. వాటిలో ఒకటి థ్యాంక్స్ చెప్పడం. ఇతరులకు మనం థ్యాంక్స్ చెప్పినా, ఇతరులు మనకు థ్యాంక్స్ చెప్పినా కలిగే సంతృప్తి చాలా బాగుంటుంది.
చిన్న చిన్న ఆనందాలు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. అది మనం చూసే దృష్టిని బట్టి, చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది.
ఉదయాన్నే లేత కిరణాల్లో, సాయంత్రం తోటలో నడవటం వంటివి మానసిక ఒత్తిళ్లను తగ్గించి, మెదడుకు విశ్రాంతిని అందిస్తాయి.
మెదడు చురుగ్గా ఉండాలంటే జిమ్‌కు వెళ్లడం, పుస్తకాలు చదవడం, పజిల్స్ పూరించడం, క్రమం తప్పకుండా పోషకాహారం తీసుకోవడం కీలకం.
సెలవుల్లో మీగతా పనులను పక్కన పెట్టి కాస్త ప్రకృతితో గడపడాన్ని అలవాటుగా చేసుకోండి. ఇలా చేయడం మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహాంగా ఉంటారు.
ఎప్పుడైతే ఇతరుల మీద ఆధారపడకుండా జీవిస్తారో అప్పుడే ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఆత్మ విశ్వాసం తో అన్ని సంతోషాలను పొందవచ్చు.