Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలో లింగవివక్ష పెద్ద సమస్య. బ్రూణహత్యల నుంచి... సాయుధ హౌదాల్లో మహిళలను ప్రవేశించనీయకపోవడం వరకు... పురుషాధిక్యత మహిళల జీవితాలతో చెలగాటమాడింది. ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. అందుకు ఓ ఉదాహరణ ఈ వార్త. ఇటీవలే ముంబై ప్రభుత్వం అగ్నిమాపక దళాల్లోకి 97 మంది మహిళను ఫైర్ ఫైటర్స్‌గా నియమించింది. అంతకుముందు నగరంలోని అగ్నిమాపక దళాల్లో మహిళల సంఖ్య కేవలం 18 మాత్రమే. ఈ 97 మంది చేరికతో అది కాస్తా 115కు చేరింది. నగరంలో 34 స్టేషన్లలో ఈ మహిళలు సేవలందించనున్నారు. వీరంతా మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాలనుంచి ఎంపిక చేసినవారు కావడం హర్షించదగ్గ విషయం. ప్రస్తుతం ఈ బ్యాచ్ వడాలాలోని రీజనల్ కమాండ్ సెంటర్లో శిక్షణ పొందుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ బ్యాచ్ పాసవుట్ అవ్వనుంది. ు