Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేడి వేడి టీని ఇష్టమైన కప్పులో తాగితే ఎంత మజాగా ఉంటుంది. అలాంటి టీ కప్పులు కాస్త పాతపడినా... పలిగినా వాటిని అలాగే జాగ్రత్తగా దాచుకుంటాం. ఎందుకంటే అవన్నీ చిరు జ్ఞాపకాలు. టీ కప్పుల పై ఉండే అందమైన పువ్వులు, బొమ్మలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. వాటిని బయట పడేద్దామన్న మనసొప్పదు. అలాంటప్పుడు వాటితో అద్భుతమైన కళాకృతులను స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఆ అపూర్వమైన వస్తువులు మీ కోసం...
ఒకే పరిమాణంలో ఉండే 25-30 టీ కప్పులను తీసుకోవాలి. వాటిని బొమ్మలో చూపిన విధంగా మధ్య భాగంలో ఒక అందమైన ప్లేట్‌ను పెట్టి దాని చూట్టు టీ కప్పులను గుండ్రంగా, డిజైన్‌గా పెట్టుకుంటే సరిపోతుంది. అయితే టీ కప్పులు బలంగా ఉండాలంటే గమ్ పెట్టి అతికించుకుంటే మంచిది.
పాతగా, వృథాగా ఉన్న టీ కప్పులతో ఇంటిని ఎంతో అందంగా అలంకరించుకోవాలి. దీని కోసం పొడవుగా, బలంగా ఉండే తాడు ఒక్కటి ఉంటే చాలు. ముందుగా టీ కప్పులను శుభ్రంగా కడిగి వాటి హ్యాండిల్‌కు తాడును కట్టాలి. ఇలా కట్టిన తర్వాత పెరట్లో లేదా ఇంట్లో వేలాడదీస్తే చాలు ఇల్లు ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
దీన్ని తయారు చేసుకోవడానికి తెలుపు రంగు అట్టముక్క, గమ్, కత్తెర, గడియారపు పుల్లలు ఉంటే సరిపోతుంది. ముందుగా అట్టముక్క మధ్య భాగంలో గడియారపు ముల్లులను గమ్ సహాయంతో అతికించుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత వాటి చివర్లో టీ కప్పులను గట్టిగా అతికించుకుంటే సరిపోతుంది. ఇది చూడటానికి చాలా కళాత్మకంగా ఉంటుంది.
పెరట్లో చెట్టు కొమ్మకు మూడు గొలుసులను కట్టాలి. ఇలా కట్టిన తర్వాత టీ సాసర్, కప్పును బొమ్మలో చూపిన విధంగా పెడితే సరిపోతుంది. అలాగే టీ కప్పులో గింజలు, బియ్యం వంటివి వేసి పెడితే పక్షులు అన్ని వచ్చి పెరట్లో చేరతాయి.
దీనికోసం మూడు టీ కప్పులు, మూడు ప్లాస్టిక్ చెంచాలు, మట్టి, ఉంటే సరిపోతుంది. ముందుగా టీ కప్పుల నిండా మట్టిని నింపి దాంట్లో ఒక చెంచా మెంతులు, ధనియాలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వాటిలో బొమ్మలో చూపిన విధంగా ప్లాస్టిక్ చెంచాలకు స్కెచ్ సహాయంతో మొక్క పేర్లు దాని మీద రాసుకొని కప్పులో ఉంచుకుంటే సరిపోతుంది.
బర్డ్ ఫీడర్‌ను టీ కప్పుతో ఎంత అందంగా తయారు చేసుకోవచ్చు. ఒక టీ కప్పును పెరట్లో చెట్టుకు తాడుతో గట్టిగా కట్టాలి. ఇలా చేసుకున్న తర్వాత మట్టి పోసి దాని మీద గింజలు, చిరుధాన్యాలు పోసుకుంటే సరిపోతుంది. ు