Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలను చదివించడం ఎంత అవసరమో... చదివిన వాటిని వారితో రాయించడం కూడా అంతే కీలకం. అయితే చదివింది చదివినట్టుగా కాకుండా వాళ్లకు అర్థమైన విధంగా రాయమని చెప్పలి. అలా రాసిన దాన్ని చదివి, వాటిలోని లోపాలను తెలిపితే మంచిది. అయితే ఏదైనా రాసేటప్పుడు భావవ్యక్తీకరణ, ఏ విధంగా ప్రజెంట్ చేస్తే బాగుంటుందని చెబితే సరిపోతుంది. దాని కోసం పిల్లలకు కొన్ని సలహాలు, సూచనలు పాటిస్తే మరింత క్లుప్తంగా, సరళంగా రాస్తారు.
అన్నింటి కంటే చదవడం కీలకం. చదవడం ద్వారానే ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారు. చదివిన దాన్ని క్రమ పద్ధతితో రాసుకోవాలి. అలా రాసుకోవడం వల్ల ఎన్నో పదాలను నేర్చుకుంటారు. పుస్తకాలు చదవితేనే వ్యాకరణం అర్థం అవుతుంది.
కొన్ని పదాలు చదవడానికి, రాయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి సమయంలో ఆ పదాలను చేతితో రాయడం, పలకడం వంటివి చేస్తే త్వరగా నేర్చుకుంటారు.
పిల్లలు రాసేటప్పుడు వాక్య నిర్మాణం ఏలా తయారు చేసుకోవాలో నేర్పించాలి. చాలా సులభంగా, అర్థమయ్యే పదాలను ఉపయోగించి వాక్యం అర్థవంతంగా ఉండేలా రాయిస్తే మంచిది.
ఒక్క పదాన్ని ఎన్ని విధాలుగా రాయొచ్చో రాసి చూపించండి. దాని కోసం కొన్ని ఉదాహరణలు చెబితే మంచిది.
ఏదైనా రాసేముందు దానికి తగిన ప్రణాళిక, రివిజనింగ్, ఎడిటింగ్ తప్పని సరి! ఈ విషయాలను చిన్నతనం నుంచి చెబుతు ఉంటే రాసే విధానంలో మరింత మార్పు కనిపిస్తుంది.