Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలంటే ఎన్ని మాటలన్నా.. ఏం చేసినా ఎదిరించలేరు అన్న భావన పురుషాధిక్య సమాజంలో నాటుకుపోయింది. ఒంటరిగా కనిపిస్తే చాలు మాటలతోనూ.. చేతలతోనూ హింసించే ప్రయత్నం చేస్తారు. అమాయకంగా కనిపించినా.. అబలగా భావించినా వారి ఆగడాలకు అంతు ఉండదు. మరి అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలంటే ఆత్మరక్షణ(సెల్ఫ్ డిఫెన్స్) టెక్నిక్స్ తెలుసుకోవాలి. ఒంటరిగా వెళ్తున్న మహిళల భుజంపై చేయ్యేసి ఆమెను అల్లరి చేయాలన్న ప్రయత్నం చేసిన వ్యక్తి నుంచి ఎలా తప్పించు కోవాలో ఈ వారం చూద్దాం..!
- మహిళలను వేధించడానికి అనువైన సమయం కోసం ఎదురుచూస్తుంటారు కొందరు మగవాళ్ళు. ఒంటరిగా కనిపిస్తే చాలు వెకిలిచేష్టలతో ఇబ్బంది పెడతారు. ఉదయమే జాగింగ్‌కు వచ్చిన అమ్మాయి భుజంపై చేయివేసి దాడికి ప్రయత్నం చేస్తున్నాడు.
- తన దారిలో తాను జాగింగ్ చేస్తుంటే భుజంపై పడిన చేయి స్పర్శతో ఉలిక్కి పడింది ఆమె. ఎవరో తెలుసుకోవాలని వెనక్కి తిరిగింది. అపరిచిత వ్యక్తి వెకిలినవ్వును చూసి తనను అల్లరిచేసే ప్రయత్నం చేస్తున్నాడని తెలుసుకుంది. భయపడిపోకుండా.. వెంటనే అలర్ట్ అయ్యింది. మోచేతితో అతడి గొంతుకపై అటాక్ చేసింది.
- గొంతుకపై ఆమె మోచేయి బలంగా తాకడంతో ఆ వ్యక్తి షాక్ తింటాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా భుజంపై వేసిన చేయిని తన చేతితో ఒడిసి పట్టుకుంది.
- మరో చేతితో అతడి ముఖంపై అటాక్ చేసింది. ముక్కు పగిలి బాధతో గిలగిలలాడుతాడు.