Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చలికి చర్మం పగిలి, ముడతలు పడినట్టు కనిపిస్తుంది. చర్మం బాగా పగిలితే దురదగా, మంటగా, నిర్జీవంగా తయారవుతుంది. అలాంటి సమయంలో కోల్డ్ క్రిమ్ లేదా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చలికాలంలో చర్మ సంరక్షణకు ఇదే మంచి మార్గం. చర్మం కోమలంగా, అందంగా కనిపించాలంటే కింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
- చర్మం బాగా పొడిగా, మంటగా అనిపించినప్పుడు గోరువెచ్చటి నీటితో కడగాలి. ఆ తర్వాత ముఖాన్ని క్లెన్సుర్తో శుభ్రం చేసుకొని, మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె రాసుకున్న మంచి ఫలితం కనిపిస్తుంది.
- చర్మం చాలా నిర్జీవంగా కనిపిస్తుంటే... సహజ సిద్ధమైన నూనెలు అంటే కొబ్బరి, ఆలివ్, జోజోబా, బేబి ఆయిల్ రాసుకోవడం మంచిది. ఇవి చర్మాన్ని మరింత అందంగా తయారు చేస్తాయి. మృత కణాలు తొలగిపోవాలంటే... సబ్బులకు బదులుగా స్క్రబ్‌లను ఉపయోగించడం మంచిది.
- చలిగా కాలంలో బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయకూడదు. అలా చేయడం వల్ల చర్మం మరింత పొడిబారి పగిలే అవకాశం ఉంది. కాబట్టి గోరు వెచ్చటి నీటితో స్నానం చేసి మాయిశ్చరైజర్ రాసుకుంటే సరిపోతుంది.
- అన్నింటి కంటే ముఖ్యమైన విషయం హెల్దీ డైట్‌ను క్రమం తప్పకుండా పాటించడం. ఏ సిజన్లో వచ్చే పండ్లను ఆ సిజన్లో తప్పకుండా తినాలి. అప్పుడే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా నీటి శాతం అధికంగా ఉన్న పండ్లను తీసుకోవాలి.