Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉంగరాల జుట్టున్న అమ్మాయిలు నిత్యం ఎదుర్కునే సమస్యలు చాలానే ఉన్నాయి. ఈ జుట్టును మెయింటైన్ చేయడం చాలా కష్టమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మీ రింగుల జుట్టు చిక్కుబడకుండా ఉండేందుకు ఈ సౌందర్య చిట్కాలను పాటించి చూడండి.
ఒక వెడల్పాటి పళ్ళున్న దువ్వెన వాడండి. ఇది రింగులు తిరిగే మీ ఉంగరాల జుట్టు మీద బాగా పనిచేస్తుంది. జుట్టును చిక్కుబడకుండా, ఊడకుండా దువ్వడానికి ఇవి బాగా పనికొస్తాయి. బైటకు వెళ్లేముందు ఇలాంటి దువ్వెనతో మీ రింగుల జుట్టు దువ్వుకుని వాటిని అలా ఉంచడానికి ఒక స్ప్రే కొట్టి చూడండి.
రింగుల జుట్టు కోసమే ప్రత్యేకంగా తయారైన షాంపూలు ఈ మధ్య మార్కెట్లో దొరుకుతున్నాయి. మీ ఉంగరాల జుట్టు చక్కగా ఉండేందుకు వీటిని వాడడం మంచిది.
ఉంగరాల జుట్టు తొందరగా వూడిపోవడం, చిక్కులు పడడానికి అవకాశం ఉంటుంది.మీ జుట్టు తుడుచుకోడానికి టవల్ కి బదులుగా కాటన్ టీషర్ట్ వాడండి. ఈ చిట్కా పాటించిన కొద్ది రోజులలోనే మీ రింగుల జుట్టులో వచ్చిన మార్పు గమనించండి.
మీ హెయిర్ డ్రయ్యర్ కి డిఫ్యూజర్‌ని తగిలించి వామ్ లేదా కోల్డ్ సెట్టింగ్‌లో ఉంచి వాడండి. ఎందుకంటే హాట్ సెట్టింగ్‌లో ఉంచి వాడితే జుట్టు కుదుళ్ళకు బాగా నష్టం కలిగి, అవి చిట్లిపోయే అవకాశం ఉంటుంది.
వేడి నూనెతో జుట్టుకి మర్దనా చేయడం మీ ఉంగరాల జుట్టుకు జీవం పోస్తుంది. ఇంటి దగ్గర చేసుకునే ఈ చిట్కాను వారానికి ఒకసారి పాటించి మీ కుదుళ్ళ ఆరోగ్యాన్ని, వాటి రూపురేఖలను బాగా మెరుగుపరుచుకోవచ్చు. అంతేకాకుండా మీ రింగుల జుట్టును దువ్వుకోడానికి అనుకూలంగా చేస్తూ, ఎండిపోయి, చిట్లిపోకుండా నివారిస్తుంది.
రాత్రిపూట జుట్టు చిక్కుబడకుండా చేయడానికి పడుకునే ముందు లీవ్-ఇన్-కండిషనర్ వాడడం మంచి ఉపాయం. దీన్ని కనీసం వారానికి రెండుసార్లు చేయడం వల్ల మీ రింగులు రోజంతా అందంగా కనపడతాయి.
తడిగా ఉన్నపుడే జుట్టు దువ్వుకోండి. ఆరిన తరువాత చిక్కులు తీస్తే జుట్టు వూడిపోడానికి, కుదుళ్ళు బలహీన పడడానికి అవకాశం ఉంటుంది. ప