Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. హంగేరీలో జరిగిన జలకరోస్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లో బెస్ట్ ఉమెన్ ప్లేయర్ అవార్డును ఆమె కైవసం చేసుకున్నారు.
కజకిస్తాన్‌లో జరిగిన యూరేసియన్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్ లో ద్రోణవల్లి హారిక బెస్ట్ ఉమెన్ ప్లేయర్‌గా నిలిచారు. చెస్ టోర్నమెంట్లో టాప్ 10 ర్యాంకింగ్‌ను అందుకున్నారు. మహిళా గ్రాండ్ మాస్టర్, అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్ బిరుదులు పొందారు.
గుంటూరు జిల్లాలో జన్మించిన హారిక చిన్నతనం నుంచే చదరంగర ఆటలో తనదైన ప్రతిభను ప్రదర్శించారు. ఏడెండ్ల వయసులోనే ఎత్తులుపై ఎత్తులు వేస్తూ.. ప్రత్యర్థిని చిత్తులు చేస్తూ.. అమ్మనాన్న, మాస్టర్లను ఆకట్టుకున్నారు. ఆమెలోని ప్రతిభను గుర్తించి టోర్మమెంట్స్కు పంపించారు. ఆసియా ఖండపు పదెండ్ల లోపు వయసు (ఖ-10), పన్నెండెండ్లలోపు వయసు (ఖ -12) పోటీలలో పాల్గొని మొదటి స్థానంలో నిలిచారు. 2003లో ముంబాయిలో జరిగిన కామన్ వెల్త్ చదరంగపు క్రీడలలో ప్రత్యర్థులను చిత్తు చేసి బమహిళా విభాగంలో రెండవ స్థానం దక్కించుకున్నారు. పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచే ఆమె చిన్నవయసులోనే మూడు ప్రపంచ యువ చదరంగ బిరుదులు సొంతం చేసుకున్నారు.
హెరాక్లియో, గ్రీసులో అండర్-14 - 2003, బటూమి, జార్గియా, అండర్-18 - 2006
గజియాన్ టెప్, టర్కీ, ప్రపంచ యువ చదరంగ పోటీ- 2008లో జరిగిన పోటీల్లో పాల్గొని టైటిల్ సొంతం చేసుకున్నారు. ఆమె జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారు.
2007లో భారత ప్రభుత్వము అర్జున పురస్కారంతో హారికను సత్కరించింది. 2019లో జాతీయ మహిళా చాంపియన్ షిప్ అందుకున్నారు. వరుసగా 16 ఏండ్లు జాతీయ మహిళా టోర్నమెంట్లలో పాల్గొని 16 మెడల్స్ గెలిచారు. 2016,2017ల్లో చెస్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ - 2016, 2017 ది టైమ్స్ ఆఫ్ ఇండియా ( వార్షిక అవార్డులు) అందుకున్నారు. గత ఏడాది వెర్వ్ మ్యాగజైన్ 2017 టాప్ 40 మంది ప్రముఖ మహిళా క్రీడాకారుల జాబితాలో హారిక ప్రకటించారు. ప