Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలు, కొత్తిమీర, క్యారెట్, వంకాయ... ఈ కూరగాయల్లో చర్మానికి తగిన పోషణనిచ్చే పోషకవిలువలు అనేకం. నిస్తేజంగా మారిన మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో తమదైన పాత్ర పోషిస్తాయి. తద్వారా, మీ చర్మం మరింత కాంతివంతంగా అలాగే అత్యంత ప్రకాశవంతంగా మారుతుంది.
- ఆలుగడ్డను స్లయిసులుగా కట్ చేసుకుని పేస్టు చేసుకోవాలి. ఇందులో రెండు టీస్పూన్ల పెరుగుని కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంపై సున్నితంగా అప్లై చేయండి. పది నుంచి పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోండి. వారానికి రెండు సార్లు ఈ విధంగా మీ చర్మాన్ని సంరక్షించుకుంటే మీరు కోల్పోయిన నిగారింపుని త్వరగా తిరిగి పొందుతారు.
- రెండు టీస్పూన్ల క్యారట్ జ్యూస్ లో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలపండి. ఇలా తయారైన మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్‌లా అప్లై చేసుకోండి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయండి. ఈ సమర్థవంతమైన వెజిటబుల్ ఫేస్ ప్యాక్‌ను వారానికి ఒకసారి వాడినట్లైతే మీ చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
- వంకాయ ముక్కలను మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ను కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై సున్నితంగా అప్లై చేసుకోండి. పదినిమిషాల తరువాత, తేలికపాటి క్లెన్సర్‌తో, గోరువెచ్చటి నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోండి. నెలలో రెండుసార్లు, ఈ వెజిటబుల్ ఫేస్ ప్యాక్ ను అప్లై చేసుకోవడం ద్వారా కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.
- రెండు మూడు క్యాబేజ్ ఆకులను బ్లెండర్లో గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమంలో ఒక టీస్పూన్ తీపిలేని గ్రీన్ టీని కలపండి. దీన్ని ముఖంపై అప్లై చేయండి. పది నుంచి పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో ఈ ప్యాక్‌ను ముఖంపై నుంచి తొలగించండి. నెలలో ఒక్కసారి ఈ ఫేస్ ప్యాక్‌ను అప్లై చేయడం ద్వారా కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.
- కొత్తిమీరను మెత్తగా నూరుకుని అందులో ఒక టీస్పూన్ ఆల్మండ్ ఆయిల్ ను అలాగే రెండు టీస్పూన్ల రోజ్ వాటర్‌ను కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేసుకొని, కొద్ది నిమిషాల పాటు మసాజ్ చేయండి. పది నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని శుభ్రపరుచుకోండి. నెలకొకసారి ఈ ఫేస్ ప్యాక్‌ను అప్లై చేస్తే చర్మం తాజాగా ఉంటుంది.