Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహరపదార్థాలను తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో పాటు ఎముకలు దృఢంగా ఉంటాయి. ప్రోటీన్లు అధికంగా ఉండే పదార్థాలేంటో తెలుసుకుందాం!
- గుడ్డులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. గుడ్డు 6 గ్రాముల ప్రోటీన్లను కలిగి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం ఉడికించిన గుడ్డు తింటే ఆరోగ్యంగా ఉంటారు. బ్రేక్ పాస్ట్‌గా ఒక ఉడికించిన గుడ్డు తింటే సరిపోతుంది.
- వెన్నలో కూడా ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. దీంట్లో 13 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. వెన్న తినడానికి ఇష్టపడని వారు వివిధ రకాల వంటల్లో, స్వీట్స్‌లో వేసుకొని తింటే మంచిది.
- కప్పు సోయా పాలల్లో 8 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. సోయా పాలు ఎముకల దృఢత్వానికి దోహదపడతాయి. అలాగే శరీరానికి అవసరమైన కాల్షియంను అందిస్తాయి.
- కప్పు పెరుగు 15 గ్రాముల ప్రోటీన్లను కలిగి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఒక కప్పు చిక్కటి పెరుగును ఆహారంలో చేర్చుకుంటే సరిపోతుంది. పెరుగును లస్సీ మాదిరి చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది.
- రెండు చెంచాల బాదం గింజల్లో 6 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. బాదం పొడిని సలాడ్స్ లేదా వంటకాల్లో వేసుకొని తినాలి.
- వేరు శనగ గింజల్లో కూడా ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఒక కప్పు వేరు శనగ గింజల్లో 22 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కొన్ని వేయించుకొని లేదా ఉడికించుకొని తిన్నా సరిపోతుంది.