Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంపాదన మొదలుపెట్టిన సమయం నుంచి చాలా మంది పెట్టుబడుల వెంట పడతారు. పెట్టుబడి పెట్టేవారిలో రెండు రకాలు ఉంటారు. ఎక్కువ రిస్క్ తీసుకుని బాగా డబ్బు సంపాదించాలని ఒక వర్గం అనుకుంటే, ఎక్కువ రిస్క్ అవసరం లేదు మన పెట్టుబడి భద్రంగా ఉంటే చాలు, ఒక రకమైన రాబడితో సరిపెట్టుకుందాం అని మరో వర్గం అనుకుంటారు. దీర్ఘకాల లక్ష్యాలు కలిగి ఉన్నావారికి మన దగ్గర ఎన్నో సురక్షితమైన పెట్టుబడులు ఉంటాయి. అలాంటి వాటిలో ఉత్తమ రక్షణ కలిగిన పెట్టుబడి మార్గాలను చూద్దాం.
1
పీపీఎఫ్
వేతన జీవులు చాలా మంది ఇష్టపడే పెట్టుబడి సాధనం పీపీఎఫ్. దీన్ని ఎంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి వడ్డీ ఆదాయానికి పన్ను ఉండదు. రెండోది 80సీ కింద పన్ను మినహాయింపు.ఇంకో విధంగా పదవీ విరమణ నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు. సాధారణంగా పీపీఎఫ్ మార్గంలో పెట్టుబడి పెడితే పదిహేనేళ్ల వరకూ వెనక్కు తీసుకోవడానికి ఉండదు. అయితే కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటే 7వ ఏట నుంచి పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తారు.
2
రికరింగ్ డిపాజిట్
(ఆర్డీ)
రికరింగ్ డిపాజిట్ చేయడం మూలంగా నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చు. దీని వడ్డీపై టీడీఎస్ కట్ చేస్తారు. ఆర్డీ దాదాపు బ్యాంకు డిపాజిట్ లాగే ఉంటుంది. 10 వేల మొత్తాల్లో టీడీఎస్‌ను లెక్కిస్తారు. పోస్టాఫీసు ఆర్డీ ప్రస్తుతం వడ్డీ రేటు 7.1%గా ఉన్నది.
3
బ్యాంక్ ఫిక్స్డ్ డిపాటిట్లు
బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లకు మీకు 6.6 నుంచి 7.5 శాతం వడ్డీ వస్తుంది. సంవత్సరం కాలం కంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టేట్లయితేనే ఎఫ్‌డీల వైపు చూస్తే మంచి రాబడి వస్తుంది.10 వేల కంటే ఎక్కువ వడ్డీ వచ్చినప్పుడు పన్ను కట్టాల్సి వస్తుంది. పన్ను పరిధిలోకి రాని వారు ఫారం 15జీ లేదా 15 హెచ్‌ను సమర్పించాలి. అలా చేస్తే వడ్డీపై పన్ను ఉండదు.
4
డెట్ మ్యూచువల్ ఫండు
డెట్ మ్యూచువల్ ఫండ్లు బ్యాంకు డిపాజిట్ల కంటే మంచి రాబడులనే అందిస్తున్నాయి. ఈక్విటీల్లో సైతం కొంత డబ్బు పెట్టుబడి పెడుతున్నందువల్ల డెట్ మ్యూచువల్ ఫండ్లు బాగానే రాణిస్తున్నట్లుగా చెప్పొచ్చు. ఈ ఫండ్ల వల్ల ప్రయోజనం ఏంటంటే మామూలు బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడి పొందుతూ కావాల్సిన సమయంలో కొంత డబ్బు వెనక్కు తీసుకోవచ్చు.
5
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్
సీనియర్ సిటిజన్స్‌కు వివిధ రంగాల్లో ప్రయోజనాలు కల్పించేందుకు అనేక స్కీమ్‌లు ఉన్నాయి. వాటిలో ఈ స్కీమ్స్ ఒకటి. ప్రతి త్రైమాసికానికి వీటి వడ్డీ రేట్లను భారత ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతం వీటి వడ్డీ రేట్లు 8.4 శాతంగా ఉన్నాయి.
6
సుకన్య సమృద్ధి పథకం
అమ్మాయిల వివాహం, ఉన్నత విద్య కోసం డబ్బు కూడబెట్టాలనుకునే వారికి సుకన్య సమృద్ది పథకం బాగా ఉంటుంది. సుకన్య సమృద్ది ఖాతాను బ్యాంకుల్లో, పోస్టాఫీసు కార్యాలయాల్లో తెరవొచ్చు. 80 సీ మినహాయింపులు ఉన్నాయి.
7
ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లు
ఈ ఫండ్లు మూడేండ్ల లాక్ ఇన్ పీరియడ్‌ను కలిగి ఉంటాయి. ఇవి దాదాపు డెట్ ఫండ్లలానే ఉంటాయి కాబట్టి మీకు సరైన పెట్టుబడి లక్ష్యం ఉన్నప్పుడే వీటివైపు మొగ్గుచూపడం మంచిది. దాదాపు బ్యాంకు ఎఫ్డీల్లానే పనితీరు ఉన్నప్పటికీ, పన్ను ఆదా కోణంలో చూస్తే ఎఫ్‌డీల కంటే ఎక్కువ రాబడులనే ఆశించవచ్చు.
8
నెలవారీ ఆదాయ పథకాలు
పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తం కావాలనుకునే వారికి బాగా ఉంటుంది. ఈ పథకం పేరిట గరిష్టంగా ఒక ఖాతాలో ఒకేసారి రూ.4.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు. ఉమ్మడి ఖాతాలో అయితే రూ.9 లక్షలు. ఈ నెలవారీ ఆదాయ పథక మెచ్యూరిటీ పీరియడ్ 5 ఏండ్లు. గతేడాది జులై 1 నుంచి ఈ పథకం సంబంధించిన వడ్డీ రేటు 7.5%గా ఉంది.