Authorization
Mon Jan 19, 2015 06:51 pm
త్వరగా పడుకుని త్వరగా లేవాలి! గాఢనిద్ర అనేది చాలా ముఖ్యమైన పని. ఇది పిల్లల శారీరిక, మానసిక సామర్ధ్యాన్ని పెంచుతుంది. త్వరగా నిద్ర లేవడం వల్ల పిల్లల శరీరం, మనసు తాజాగా, ఉల్లాసంగా ఉంటాయి. తగినంత విశ్రాంతి అందితే మాత్రం పిల్లలు త్వరగా నిద్ర లేస్తారు. దీని కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటే సరిపోతుంది.
పిల్లలు సమయానికి నిద్ర లేవాలంటే రాత్రి త్వరగా నిద్రపోయేలా అలవాటు చేయాలి. తగినంత నిద్ర చిన్నారుల ఎదుగుదలకు కీలకం.
స్కూల్ సమయం, కుటుంబం, ఆఫీసు పనుల వల్ల పిల్లలు అసౌకర్యానికి గురవుతారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుంటే మంచిది. అలాగే సెలవులు పూర్తి కాగానే ఉదయాన్నే లేవడానికి ఇష్టపడరు. అలాంటి సమయంలో వారం నుంచే సిద్ధం చేయాలి.
పిల్లలు నిద్ర సరిగ్గా పోకపోతే వారి రోజంతా ఎలా గడిచింది? ఎంత అలసిపోయారు? అనేది తెలుసుకోవడం అవసరం. పిల్లలను ఎక్కువ ఒత్తిడికి గురి చేయకూడదు. దీనివల్ల వారి జీవితం మరింత ఒత్తిడికి గురవుతుంది. నిద్రపోవడం, లేవడం వంటి ప్రణాళికలని అనుసరించడం అనుకున్నంత తేలిక కాదు. కాబట్టి దినచర్యలో కొంత భాగంగా అలవాటు చేస్తే మంచిది.
కొన్నిసార్లు ఉదయాన్నే లేవడానికి ఇష్టపడరు. ఇలాంటి సందర్భాలలో చిన్న బహుమతులు ఇచ్చి తెలివిగా ప్రవర్తించడం మంచిది. అలాగని బహుమతులనే అలవాటు చేయకూడదు. రి