Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కండ్లకు మేకప్ వేసుకునే విషయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే పెద్దగా కనిపించేలా చేయొచ్చు. అదెలాగంటే..
కనుబొమల కింద ఉండే ప్రదేశంలో లేత రంగును రాసుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వండి. దానివల్ల కండ్లు పెద్దగా కనిపిస్తాయి.
కండ్ల కింద నల్లటి వలయాలుంటే కూడా కండ్లు చిన్నగా అనిపించే అవకాశం ఉంటుంది. అందుకే కాస్త కన్సీలర్ను రాసుకుంటే, అవి కాస్త పెద్దవిగా అనిపిస్తాయి.
కనుబొమలను ఎప్పుడూ సరైన ఆకృతిలో ఉంచుకోవాలి. అలాచేస్తే కండ్లకూ, కనుబొమలకు మధ్య ఉన్న ప్రాంతం విశాలంగా అనిపించి చిన్నగా అనిపించవు.
కొంతమంది కండ్లు పెద్దగా కనిపించాలని చుట్టూ ఐ లైనర్ రాస్తుంటారు. దీనివల్ల ఇంకా చిన్నగా కనబడతాయి. దానికి బదులు పైవైపు మాత్రమే రాసుకుంటే మేలు.
పై రెప్పకు ఐలైనర్ రాస్తున్నప్పుడు మొదలు నుంచీ కాకుండా కాస్త మధ్యలో నుంచి కంటి చివరి వరకు పొడిగించండి. అలాగే కింది రెప్పకు రాయకపోవడమే మంచిది.
కంటి మొదళ్ల దగ్గర తెలుపు లేదంటే ఏదైనా లేత రంగు ఐషాడో రాసుకోవాలి. దానివల్ల కూడా కండ్లు పెద్దగా అనిపిస్తాయి. అలాగే కాస్త లేత రంగుల మేళవింపులో షిమ్మర్ రాసుకున్నా బాగుంటుంది.
కండ్లు కాస్త ఉబ్బినట్లుగా ఉన్నా అవి చిన్నగా కనిపించొచ్చు. అందుకే కండ్ల మీద కీరదోసా, బంగాళదుంపను చక్రాలుగా తరిగి కాసేపు ఉంచుకోండి. ఫలితం ఉంటుంది.
మస్కారా విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ముందుగా దట్టంగా కాకుండా కొద్దిగా రాసుకున్న తర్వాత రెండోసారి కాస్త ఎక్కువగా రాయండి. దీనివల్ల కంటిరెప్పలు కూడా సరైన ఆకృతిలో ఉంటాయి. ు