Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లో రకరకాల కూరగాయలూ, పండ్లని తొక్కలు తీసి ఉపయోగించుకుంటాం. అయితే వాటిని పడేయకుండా ఇలా ఉపయోగించుకుంటే బాగుంటుంది.
బంగాళాదుంపలు: వీటి తొక్కల్లో విటమిన్ సి అధికం. వీటిని కాసేపు ఫ్రిజ్లో ఉంచి తీసి కండ్ల మీద ఉంచుకొని, పావుగంటయ్యాక తీసేసి కండ్లను శుభ్రం చేసుకుంటే మంచిది.
అరటి: ఈ పండు తొక్కలతో దంతాలను శుభ్రం చేసుకుంటే తెల్లగా మారతాయి. వీటి ద్వారా దంతాలకు మెగ్నీషియం, మాంగనీసు, పొటాషియం అంది దృఢంగా ఉంటాయి.
కమలాఫలం: ఈ తొక్కల్ని గుమ్మాల వద్దా, వంటింట్లో, గదుల్లో ఉంచితే దుర్వాసన దూరమవుతుంది. ఈ తొక్కల్ని నీళ్లలో వేసి మరిగించి గది మధ్యలో ఉంచితే పరిమళం వెదజల్లినట్టు మంచి వాసన వస్తుంది.
ఉల్లిపాయ: ఈ పొట్టును పారేయకుండా చెట్ల మొదళ్లలో వేస్తే మొక్కలకు సల్ఫర్ అందుతుంది. ఏపుగా ఎదుగుతాయి. పూలు కూడా బాగా పూస్తాయి. ు