Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇల్లు చిన్నగా ఉందని చాలామంది బాధపడుతుంటారు. ఇక శుభకార్యలు.. పండుగలొస్తే అలంకరించుకోవడానికి కూడా ఇబ్బందే! అలాంటి వారు కొంచెం సృజనాత్మకంగా ఆలోచిస్తే చాలు ఇరుకిరుకు గదులను కూడా విశాలంగా మార్చేయగలరు. అలాంటి కొన్ని చిట్కాలు మీ కోసం...
ఇంట్లో మొక్కలు లేవని బాధపడుతున్నారా! అయితే ఏం పర్వాలేదు... ఇలా చేసేయండి.. సన్నగా, పొడవుగా, దృఢంగా ఉన్న తీగలను తీసుకోవాలి. ఇంటి బయటి గోడకు మొలలు బిగించి, తీగలను అల్లుకోవాలి. ఇక ఆ తీగలకు చిన్న చిన్న పూల కుండీలను వేలాడదీస్తే సరిపోతుంది.
హాలో చిన్నగా, పొడవుగా ఉండే టేబుల్‌ను పెట్టుకోండి. అన్నింటికి సౌకర్యవంతంగా ఉంటుంది. చూడటానికి అందంగా కూడా కనిపిస్తుంది.
ఎలక్ట్రానిక్ చార్జింగ్ కోసం ఇంట్లో ఓ ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచిది. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.
హ్యాంగింగ్ వాల్ సోరేజ్ వల్ల గోడలు అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. పాత లెదర్ క్రాప్ట్స్, చిన్న చిన్న బ్యాగుల ను గోడలకు వేలాడదీస్తే సరిపోతుంది. వాటిలో కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, టెలిపోన్ బిల్లు మొదలైన ముఖ్యమైన కాగితాలను దాచుకోవచ్చు.
వాల్ హ్యాంగర్ నోట్ పాట్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. దీన్ని కంప్యూటర్ పక్కన పెట్టుకుంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది.
ఇంటిని శుభ్రపరిచే వస్తువులును, బట్టలను గదిలో ఒకవైపు గోడకు హ్యాంగ్ చేసుకుంటే మంచిది. ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల ఇల్లు గందరగోళంగా కనిపిస్తుంది. ు