Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక గంటపాటు ఇంటిని శుభ్రం చేస్తే దాదాపు వంద క్యాలరీలు ఖర్చవుతాయట. ఇంటి శుభ్రత అంటే చాలా మంది భయపడిపోతారు. దాని కోసం ఒక రోజు కేటాయించాలని ఆందోళనపడతారు. దాని కోసం అంతగా భయపడాల్సిన పని లేదు. కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
ఇల్లు తుడిచేటప్పుడు యాంటీ బ్యాక్టీరియల్ సొల్యూషన్ వాడుతున్నట్లైతే ఇలా చేయండి. ఒక బకెట్ నీటిలో రెండు చెంచాల యాంటీ బ్యాక్టీరియల్ సొల్యూషన్ వేసి అరగంట పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నీటిని ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఇంట్లోకి వచ్చేటప్పుడు డోర్ మ్యాట్‌కు కాళ్లు తుడుచుకోని రావడం ద్వారా చాలా వరకు దుమ్ము, ధూళి ని ఇంట్లోకి చేరకుండా ఆరికట్టవచ్చు.
వంటగదిలో ఉపయోగించే క్లాత్స్కు, సింక్ లో ఎక్కువ క్రిములు ఉంటాయి. కాబట్టి వాటిని తరచు శుభ్రపరుచుకోవడం ఆరోగ్యకరం.
పాత మేకప్ బ్రష్‌లను, పాత టూత్ బ్రష్‌లను కిటికీ అంచులను శుభ్రపరచడానికి ఉపయోగించవచ్చు. వంటగది టైయిల్స్ మీద నూనె మరకలు ఉన్నట్లైతే గ్లాసు నీటిలో ఒక చెంచా నిమ్మరసం, చిటికెడు బేకింగ్ సోడా కలిపి టైయిల్స్ మీద చల్లాలి. ఇలా చల్లిన పది నిమిషాల తర్వాత బ్రష్‌తో రుద్దితే నూనె, జిడ్డు మరకలు పూర్తిగా తొలగిపోతాయి.