Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందరిలో ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా కనిపించాలని ఎవరికి మాత్రం కోరిక ఉండదు. అందు కోసం రకరకాల క్రీములను, ఫేస్ ప్యాక్‌లను వాడుతుంటారు. అయితే కొన్ని పదార్థాలను పొరపాటున కూడా ముఖానికి ఈ విధంగా రాసుకోకూడదు. అలా రాకుంటే మీ చర్మం త్వరగా పాడవుతుంది. ఏ విధంగా రాసుకోకూడదో... ఎలాంటి పదార్థాలను ఉపయోగించకూడదో తెలుసుకుందాం...
బేకింగ్ సోడా ఆల్కలైన్ అనే రసాయనం ఉంటుంది. ఇది చర్మంలో సహజంగా ఏర్పడే పీహెచ్ లెవల్స్ పాడుచేస్తుంది. ముఖ్యంగా సెన్సిటివ్ చర్మం ఉన్నవారు బేకింగ్ సోడాను అస్సలు వాడకూడదు. దాంతో పాటు బేకింగ్ సోడాలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. అవి చర్మాన్ని కాపాడుతాయి. అయితే బేకింగ్ సోడాను ఉపయోగించే వారు ముందుగా చేతిపై ఆప్లై చేసుకొని ఎలాంటి ఇరిటేషన్, దురద, మంట లేకపోతే ముఖానికి ఆప్లై చేసుకోవాలి.
బేకింగ్ సోడా చర్మంపై ఉండే మృత కణాలను, మురికి, జిడ్డు, నలుపు వంటి వాటిని తొలగిస్తుంది. కానీ ఇది అన్ని చర్మతత్వాల వారికి మంచిది.
చాలామంది మొటిమలను తగ్గించుకోవడానికి టూత్ పేస్టును ఉపయోగిస్తారు. మరికొందరు చర్మంపై జిడ్డును తొలగించుకోవడానికి టూత్ పేస్టుతో వాష్ చేసుకుంటారు. ఇలా టూత్ పేస్టును వాడటం చర్మానికి అంత మంచిది కాదు. దీన్ని ఆప్లై చేయడం వల్ల చర్మరంధ్రాలు మూసుకుపోతాయి. దాంతోపాటు చర్మ సంబంధిత సమస్యలు అంటే మొటిమలు, ఎలర్జీ వచ్చే అవకాశం ఎక్కువ. మొటిమలను తగ్గించుకోవడానికి టూత్ పేస్టుకు బదులుగా ట్రీ ట్రీ ఆయిల్‌ను వాడితే మంచిది. ఇది మొటిమలను త్వరగా తగ్గిస్తుంది.
కొంతమంది ముఖాన్ని తెల్లగా, అందంగా మార్చుకోవడానికి వెనిగర్‌ను ఉపయోగిస్తారు. వెనిగర్‌ను డైరెక్టుగా ఉపయోగించడం వల్ల చర్మం త్వరగా పాడవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఆపిల్ సైడర్ వెనిగర్‌లో కొద్దిగా నీటిని కలిపి ముఖానికి ఆప్లై చేసుకోవచ్చు.
నిమ్మరసంలో పీహెచ్, ఆసిడిక్ గుణాలు అధికంగా ఉంటాయి. చర్మాన్ని అందంగా మార్చుకోవడానికి నిమ్మరసం ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ నిమ్మరసాన్ని మోతాదుకు మించి వాడకూడదు. కేవలం నిమ్మరసాన్ని మాత్రమే చర్మానికి ఆప్లై చేయకూడదు. నిమ్మరసంలో కొద్దిగా నీటిని లేదా గులాబీ నీటిని కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ు