Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గులాబీ పువ్వులను ఇష్టపడని వారు చాలా అరుదు. గులాబీ పువ్వులను అలంకరణ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి అలంకరణకే కాదు ఆరోగ్యానికి కూడా మంచిదని చెబుతున్నాయి కొన్ని పరిశోధనలు. గులాబీ నుంచి ఉత్పత్తి అయ్యే నీరు, ఆకులు, కాండం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గులాబీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
శరీర బరువు తగ్గించడంలోగులాబీ పువ్వులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మూడు చెంచాల రోజ్ వాటర్‌లో కొద్దిగా మెంతుల పొడి కలుపుకొని తాగితే శరీరబరువు తగ్గుతారు. అలాగే గులాబీ ఆకులను తినడం వల్ల క్యాలరీలు ఖర్చవుతాయట.
ముఖం మీద ఉండే మచ్చలు, మొటిమలను తగ్గించడంలో గులాబీ పౌడర్ బాగా పని చేస్తుంది. కొన్ని నీళ్లల్లో గులాబీ పౌడర్‌ను కలుపుకొని ముఖానికి ఆప్లై చేసుకోవాలి. ఇలా పది నిమిషాలు ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం తాజాగా, అందంగా తయారవుతుంది. పీరియడ్ సమయంలో ఇలా చేస్తే మొటిమల సమస్య తగ్గుతుంది.
గులాబీ నీటితో ముఖాన్ని కడగడం లేదా గులాబీ పౌడర్‌ను ముఖానికి, మెడకు ఆప్లై చేయడం వల్ల చర్మ గ్రంధుల్లో పేరుకుపోయిన మురికి, దుమ్ము పూర్తిగా తొలగిపోతుంది.
గులాబీ నుంచి విడుదలయ్యే పరిమళం మార్చడంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తుంది. సాన్నం చేసే నీటిలో గులాబీ ఆకులు వేసుకుంటే మరి మంచిది. ు