Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లో చిన్నారులు ఏలా మాట్లాడుతున్నారు! మౌనంగా ఉంటున్నారా! ఒంటరిగా ఉంటున్నారా! చెప్పిన మాట వినడం లేదా! ఎవరితో కలవలేకపోతున్నారా! ఇవి పైకి చిన్నగా కనిపించినా వారి బాధ వర్ణనాతీతం. ఉదయం ఏడు గంటలకు ఇంట్లో నుంచి స్కూల్‌కు వెళ్తే రాత్రి ఏడు గంటలకు ఇంటికి చేరుకుంటారు. తల్లిదండ్రులతో గడిపే సమయం ఉండదు. ఈ హడావిడి సమయంలో ఆఫీసు పనుల్లో పడి చిన్నారులను నిర్లక్ష్యం చేస్తుంటారు చాలామంది తల్లిదండ్రులు. ఇలా చేయడం వల్ల చిన్నారులు తీవ్ర డిప్రెషన్ గురవుతారు. కొన్నిసార్లు ఒంటరితనం భరించలేక ఆత్మహాత్యలు కూడా చేసుకుంటారు. అలా కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కొన్ని సూచనలు పాటిస్తే సరిపోతుంది.
ఏకాగ్రత్తతో వినటం: కొంత మంది తల్లిదండ్రులు పిల్లలు మాట్లాడుతుంటే చాలా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తారు. పిల్లలు ఎంతో ఇష్టంగా మాట్లాడు తుంటే చికాకు పడుతారు. అలా మాట్లాడుతున్న ప్పుడు ఏకాగ్రత్తతో వినండి. వారు చెప్పే మాటలు వినకుండా అటుఇటూ చూసుకుంటూ లేదా టీవీ చూసుకుంటూ ఏదైనా పని చేసుకుంటూ ఉంటే పిల్లల మనసు తొందరగా నొచ్చుకుంటుంది. వారి మనసులో ఏదో తేలియని బాధ ఆవరిస్తుంది. వారి తపనను అర్థం చేసుకునే వారు లేరని ఒంటరిగా ఫీలవుతారు.
భావాలకు స్పందించండి: పిల్లల ప్రవర్తనలోనే వారిలో ఉన్న భావలు అర్థం అవుతుంటాయి తల్లిదండ్రుల కు. పిల్లలు చెప్పే కథలకు, మాటలకు తొందరగా స్పందించండి. ''అవునా... వావ్... అంటూ ఆశ్చర్యంతో వారిని పొగడండి. ఎంతో సంతోషి స్తారు. వారి భావనను అర్థం చేసుకునే వారున్నరని చాలా కంఫర్ట్‌గా ఫీలవుతారు. ఎప్పడు వారి భావాలను, ప్రవర్తనను, మాటలను... అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే సరిపోతుంది. ఉదాహరణకు పిల్లలకు సూచనలు ఇచ్చే ముందు ''పిల్లలు స్కూల్లో స్నేహితులతో పెన్సిల్ లాక్కొవటం, పెన్ను తీసుకోవటం వంటివి చేస్తే...వెంటనే మీరు చెప్పాల్సింది. గట్టిగా ఆరవకుండా నెమ్మదిగా ''అది నీది కాదు నాన్న'' అని చెప్పాలి. అప్పడే పిల్లలు తొందరగా అర్థం చేసుకుంటారు.
ఎక్కువగా ప్రశ్నించకండి: పిల్లలు మాట్లాడుతుంటే... నటించుకుంటూ మాట్లాడితే ఎక్కువగా ప్రశ్నించకండి. టీవీలో వచ్చే ప్రోగామ్స్‌ను బట్టి కొంత మంది పిల్లలు అలానే ప్రవర్తిస్తుంటారు. అలాంటి సమయంలో టీవీ చానెల్ మార్చటం లేదా బయటకెళ్ళి స్నేహితులతో ఆడుకోవటం లేదా వారికి చిన్న చిన్న పనులు నేర్పిచటం వంటివి చేయండి. అలానీ బయటకెళ్ళి ఏ ఆటలు ఆడుకున్నావు... స్నేహితులతో ఏం మాట్లాడి నావు... టీవీలో ఏం ప్రొగామ్ చూశావు... ఇవ్వాళ ఏం నేర్చుకున్నావు అంటూ.... పిల్లలపై ప్రశ్నల
వర్షం కురిపిస్తుంటారు కొంత మంది తల్లిదండ్రులు. ఇలా చేయటం వల్ల పిల్లలకు ఏం చేయాలో తోచదు.. ఇలాంటి విషయాలే పిల్లలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. తల్లిదండ్రులు గా వారికి స్వేచ్ఛ కల్పించాల్సిన బాధ్యత కూడా మీదే అని గుర్తించాలి.
కొన్ని అవకాశాలు ఇవ్వండి: పిల్లలకు వారికిష్టమైన రంగు డ్రెస్‌లను కొనివ్వటం, బొమ్మలను ఇప్పిచటం, వారికిష్టమైన పుస్తకాలు కొనివ్వటం వంటివి చేయండి. ఇలా చేస్తే పిల్లలు ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా ఉంటారు. ఇది వారి ఎదుగుదలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. అలానీ అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వటం చేయటం మంచిది కాదు. ఇలా ఇవ్వటం వల్ల పిల్లలకు చెడు అలవాట్లు అలవడే ప్రమాదం ఉంది. కొన్ని హెచ్చరికలు చేస్తూ ప్రతి విషయం లోని మంచి, చెడు ప్రభావాన్ని వివరిస్తూ చెబితే మంచి ప్రవర్తనతో భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది.
అభినందించాలి, శిక్షించాలి: కొన్ని సందర్భాల్లో పిల్లలు తప్ప చేస్తే కచ్చితంగా శిక్షించాలి. లేదంటే వారు అదే పనిగా తప్పులు చేస్తుంటారు. పిల్లలు పెద్దయ్యే క్రమంలో ఇది ఒక అలవాటుగా మారు తుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో తల్లి దండ్రులు జాగ్రత్తగా ఉండాలి. అలాగే అదే సమయంలో ఏదైన మంచి పని చేస్తే అభినం దించాలి. ఒకవేళ అభినందించకపోతే లోపలే కుమిలిపోతారు. లేదా ఎవరికి చెప్పుకోకుండా బాధపడుతారు. ఇలా బాధ పడటం వల్ల పనులు చేయటానికి, చదువు కోవటానికి, కొత్త విషయాలు నేర్చుకోవటానికి పెద్దగా ఆసక్తి చూపించారు. ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తే కచ్చితంగా అభినందించాలి. వారి ప్రవర్తనలో మంచి చెడులను గమనిస్తూ.. వారికి కాస్త సమయం కేటాయిస్తేనే పిల్లలు ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు.