Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హేవిళంబిని సాగనంపి..
యేతెంచినది విళంబి..
నవయుగానికి నాంది పలికి
కొత్త ఊహలకు ఊపిరి నిలిపి
జలకళతో చెరువులు నిండి
బీడు భూముల కడుపు పండి
పంటలు సిగిడి రంగుల నిండి
పచ్చదనపు చిగుళ్ళు ఆహ్వానం పలుకంగ
మోడుబారిన శిశిరాన్ని సాగనంపి
ప్రకృతి మది పులకించంగ
సబ్బండ వర్ణాలు సంతసించంగ
కొత్త ఆశల తియ్యని మకరందాలతో
ఆసాంతం తోడుండాలి ఈ నవ వసంతం
విళంబి నామం కావాలి నిత్య శోభితం!!
- పాల్వంచ హరికిషన్,
రామన్నపేట,యాదాద్రి జిల్లా
సెల్: 9502451780