Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలు బాగా సన్నగా, బలహీనంగా ఉన్నారంటే కాస్త ఆలోచించాల్సిందే ! కొంత మంది చిన్నారులు ఎంత ఆహారం తీసుకున్నా వారి శరీర బరువు చాలా తక్కువగా ఉంటుంది. శరీర బరువు తక్కువగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. పిల్లలు బొద్దుగా, బలంగా కనిపించాలంటే రోజు వారికి కొవ్వు పదార్థాలు లేని అధిక క్యాలరీలున్న పోషకాలను ఆహారంలో చేర్చితే సరిపోతుంది.
ు ప్రతిరోజు చిన్నారులకు ఒక గ్లాసు పాలు, ఒక అరటిపండుతో చేసిన షేక్ ను రోజుకు రెండు సార్లు తాగించండి. ఎక్కువ మోతాదులో ఖర్జూర పండ్లను తినిపించండి. అలాగే రోజు ఒక గ్లాసు తేనె కలిపిన వేడి పాలను తాగించాలి. ఒక కప్పు పెరుగును తినిపించండి. ఒకవేళ అరటి పండు తినకపోతే, వివిధ రకాల పండ్లను, పాలల్లో కలిపి తాగించాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన చక్కెరలు, పాల నుండి ప్రోటీన్లు అందుతాయి.
ు ఖర్జూర పండ్లు శరీర బరువును పెంచడంలో సహాయపడతాయి. రోజుకు కనీసం మూడు సార్లు ఖర్జూర పండ్లను తినిపిస్తే పిల్లలు త్వరగా బరువు పెరుగుతారు.
ు ఒక గ్లాసు వేడి పాలల్లో ఒక చెంచా తేనె, బాదం పొడిని కలిపి తాగించాలి. బరువు తక్కువగా ఉన్న పిల్లలకు ఇది మంచి ఔషధంగా సహాయపడుతుంది.
ు శరీర బరువును పెంచడంలో ఎండు ద్రాక్ష కూడా బాగా పని చేస్తుంది. కాబట్టి రోజుకు కనీసం 30 గ్రాముల ఎండు ద్రాక్షలు తినిపించాలి. ఎండు ద్రాక్ష తినడానికి ఇష్టపడని పిల్లలకు స్వీట్స్‌లో లేదా హల్వాలో కలిపి పెడితే సరిపోతుంది. ప