Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుండె జబ్బులు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. వీటిని నిరోధించేందుకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి! జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుందని న్యూట్రీషియన్స్ చెెబుతున్నారు.
జీడిపప్పు: గుండె ఆరోగ్యానికి మంచిదైన ఒలేయిక్ ఆమ్లం జీడిపప్పులో లభిస్తుంది. ఇంకా రాగి, మెగ్నీషియం, జింక్, ఇనుము ఇలా శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు జీడిపప్పులో ఉంటాయి. కాబట్టి క్రమం తప్పకుండా రెండు లేదా మూడు తీసుకున్న గుండె సంబంధిత సమస్యల నుంచి కాపాడుకోవచ్చు.
బాదం: బాదం పప్పులో మెగ్నీషియం, పొటాషియం, మాంగనీసు, క్యాల్షియం, రాగి వంటి ఖనిజ లవణాలు, విటమిన్ 'ఇ' పుష్కలంగా ఉంటాయి. రోజూ బాదం పప్పులు తింటే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచే ఫోలేట్, విటమిన్ 'బి' లోపంతో బాధపడేవారు బాదం తింటే మంచిది.
వాల్నట్స్ : ఒమెగా-3 ఎసెన్షియల్ ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అధిక రక్తపోటును హానికర కొలెస్ట్రాల్ స్థాయిల్ని నియంత్రిస్తుంది. వీటికుండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఒత్తిడి, ఆందోళన వంటివాటి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వాల్‌నట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఎండుద్రాక్ష: వీటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. మెనోపాజ్ దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఎముకలపై దుష్ప్రభావం చూపి ఆస్టియోపోరోసిస్ వ్యాధికి దారితీస్తుంది. అలాకాకుండా ఎముకల ఆరోగ్యాన్ని రక్షించే బోరాన్ అనే ఖనిజలవణం ఎండు ద్రాక్షలో పుష్కలంగా ఉంటుందని న్యూట్రీషన్లు చెబుతున్నారు.