Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగ అవకాశాలకు ప్రస్తుతం రెజ్యుమ్ కీలకం. రెజ్యుమ్ తయారు చేసేటప్పుడు సహజంగా కొన్ని తప్పులు దొర్లుతాయి. ఆ తప్పులు కూడా రాకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే!
ఉద్యోగానికి వెళ్లినప్పుడు ముందుగా అడిగేది మీ రెజ్యుమ్ దాన్ని తప్పులు లేకుండా చూసుకోవాలి. అయితే కొన్నిసార్లు పదాలు అటు ఇటూ రాయడం, లేకుంటే అక్షర దోషాలు రావడం వంటివి జరుగుతాయి. కాబట్టి రెజ్యుమ్ పూర్తికాగానే ఒకసారి చదివి చెక్ చేసుకోవాలి.
రెజ్యుమ్ పూర్తికాగానే ఇంకా మరిచిపోయినా కాలామ్స్ లేదంటే మిగతా అచివ్మెంట్స్ ఇలా అన్నీంటిని పూర్తి చేయడం మంచిది. కొన్నిసార్లు సంవత్సరాలు, తేదీలు, నెలలు, ఫలితాలు, పర్సంటేజ్, తక్కువ వేయడం లేదా ఎక్కువ వేయడం వంటి తప్పులు చేస్తారు. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
అలాగే మీరు ఏ హౌదా కోసం ప్రయాత్నిస్తున్నారో దాన్ని రెజ్యుమ్లో స్పష్టంగా రాయాలి. అలాగే మీకున్న హాబీలను, వ్యక్తిగతంగా ఉన్న ఇతర నైపుణ్యాలను కూడా రాస్తే మరీ మంచిది. కొంతమంది ఇది అవసరమా అని వదిలేస్తుంటారు. అది చాలా పొరపాటు. రెజ్యుమ్లో ప్రతిదీ ముఖ్యమే. అలాగే ఎక్కువ డేకరెట్ చేయడం కూడా మంచిది కాదు. దీని వల్ల చదవడం ఇబ్బందిగా ఉంటుంది.
కొంతమంది రెజ్యుమ్ను రెండు, మూడు పేజీల్లో తయారు చేసుకుంటారు. అలా తయారు చేసుకోవడం వల్ల చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి చాలా క్లుప్తంగా, చదవడానికి ఇబ్బంది లేకుండా అన్నీ విషయాలను వివరంగా రాస్తే సరిపోతుంది.
రెజ్యుమ్ పంపించే ముందు తేదీ విషయంలో జాగ్రత్తగా చుసుకోవాలి. రెజ్యుమ్ ఎప్పుడు రెడీ చేశారో చూడరు. దాన్ని పంపించిన తేదీని ముఖ్యంగా చూస్తారు. కాబట్టి ఇది సరిచేసుకుంటే మంచిది. ు