Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫేషియల్ అనగానే పార్లర్‌కు పరిగెత్తి పర్స్ ఖాళీ చేసుకుంటారు చాలామంది. సింపుల్ ప్యాక్స్‌తో ఇంట్లో పార్లర్‌లాంటి నిగారింపు పొందవచ్చు. ఇంట్లోనే సహజంగా చేసుకోగలిగే ఫేస్ ప్యాక్స్ కొన్ని..
బొప్పాయితో... చర్మానికి మెరుపునిచ్చే పండ్లల్లో బొప్పాయి ఒకటి. ఈ బొప్పాయి మాస్క్ తయారుఉ చేసుకోవడానికి.. మూడు ముక్కలు బాగా పండిన బొప్పాయి తీసుకుని... దానికి రెండు చెంచాల బాదం పొడిని కలుపుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్‌లాగా వేసుకుని పది నిమిషాల తరువాత ముఖాన్ని మర్దన చేయాలి. తరువాత చల్లని నీళ్లతో కడిగేయాలి.
పెరుగుతో... రెండు చెంచాల పెరుగుకు రెండు లేదా మూడు చ్చుల బాదం నూనెను కలపాలి. ఒక చెంచా తేనెను చేర్చాలి. ముఖంపై సమానంగా అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత ముఖానికి మృదువుగా మసాజ్ చేసి చల్లని నీటితో కడిగేయాలి. చర్మాన్ని మృదువుగా చేయడమే కాదు... సహజమైన అందాన్నిస్తుంది.
తేనెతో... వయసును తగ్గించే సహజమైన ద్రావణం తేనె. వారానికి మూడు సార్లు తేనెను ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తరవాత చల్లని నీటితో కడిగేయాలి.
బాదంతో... బాదాంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది ఓట్స్, మిల్క్‌తో కలిస్తే అద్భుతాలను సృష్టిస్తుంది. ఒక చెంచా బాదం పొడి, ఒక చెంచా ఓట్స్ తీసుకోవాలి. ఈ రెండింటిని పాలల్లో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తరవాత చల్లని నీటితో కడిగేయాలి. స్కిన్‌టోన్‌ను పూర్తిగా మార్చేస్తుంది. చర్మానికి నిగారింపునిస్తుంది.
క్యారెట్‌తో... క్యారెట్లో విటమిన్ 'స'ి, 'కె' తోపాటు 'బి' కెరోటిన్ ఉంటుంది. క్యారెట్ తీసుకుని గుజ్జుగా చేసుకోవాలి. పాలపొడి, చక్కెరతో బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.