Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీరదోసకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వేసవి వేడి నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే ఈ ప్యాక్ ను ట్రై చేసి చూడండి!
ఫేస్ ప్యాక్: కీరదోసకాయను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మొదట ముఖాన్ని క్లెన్సర్ తో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత కీర ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి. ముఖానికి వేసుకున్న ప్యాక్ పూర్తిగా పొడి బారిన తర్వాత చేతి వేళ్ళతో ప్యాక్ ను సున్నితంగా తొలగించుకోవాలి. చివరగా ఐస్ క్యూబ్స్ తో ముఖాన్ని శుభ్ర పరుచుకుంటే సరిపోతుంది.
డ్రై స్కిన్: కీరదోసకాయలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి పొడి బారిన చర్మం వారు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. చర్మం బాగా పొడిబారితే దురదగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో చర్మానికి కీర ఫేస్ ప్యాక్ వేసుకుంటే త్వరగా ఉపశమనం పొందుతారు. కీరదోసకాయలో ఉండే వాటర్ చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. దాంతో చర్మం సహజంగానే కాంతివంతంగా మెరుస్తుంది.
ఇన్ఫెక్షన్స్ నివారణకు: కీరోదోసకాయలో విటమిన్ 'ఎ' అధికంగా ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా పని చేస్తుంది. చర్మ సమస్యలను, ఇన్ఫెక్షన్స్ను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వ