Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిష్ వాష్: రాత్రి డిన్నర్ చేసిన తర్వాత పాత్రలను షింక్‌లో అలాగే వదిలేయకూడదు. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకోవాలి. షింక్‌ను శుభ్రం చేసిన తర్వాత నిమ్మతొక్కతో లేదా వెనిగర్ వేసి రుద్ది కడగాలి. ఇది షింకులోని వాసనను నివారిస్తుంది.
స్టౌ క్లీనింగ్: రాత్రి డిన్నర్‌కు వంటలు వండిన తర్వాత సాఫ్ట్‌గా ఉండే కాటన్ క్లాత్, వెనిగర్, సాల్ట్ సహాయంతో స్టౌ మీద పడ్డ ఆయిల్ మరకలన్నింటినీ తొలగించాలి. వండిన పదార్థాల మరకలు, గ్రేవీ మరకలు, పాల మరకలున్నట్లయితే డిష్ వాష్ సోప్‌తో శుభ్రం చేయాలి.
కార్పెట్ : రాత్రి పడుకునే ముందే డోర్ మ్యాట్‌ను దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. డోర్ మ్యాట్‌ను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల డస్ట్ అలర్జీలు రాకుండా కాపాడుకోవచ్చు.
బెడ్ క్లీనింగ్ : బెడ్‌ను రెగ్యులర్ గా క్లీన్ చేసుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని బెడ్ మీద దుమ్మును దులపడం, మెత్త మీద ఉండే దుమ్మును వదిలించుకోవడం వల్ల డస్ట్ అలర్జీలతో పాటు చర్మ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.
షూ ర్యాక్: బెడ్ రూమ్ కు దూరంగా షఉ ర్యాక్ ను ఉంచుకోవాలి. చెప్పులన్నింటిని స్టాండ్‌లో అమర్చి ఇంటి బయట లేదా వరండాలో పెట్టుకోవాలి.
టాయిలెట్ ఫ్లష్: నిద్రించడానికి ముందు టాయిలెట్ ఫ్లష్ అవుట్ చేయాలి. ఇలా చేయడం వల్ల టాయిలెట్ శుభ్రంగా ఉంటుంది. ఎలాంటి వాసన ఉండదు.