Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంట్రుకల చివర్లు చిట్లిపోయినట్టు, నిర్జీవంగా ఉన్నాయా! ఈ సమస్య సహజంగా అందరిని వేధిస్తుంది. అయితే జుట్టు చిట్లిపోయినప్పుడు ట్రిమ్మింగ్ చేయించుకోవడం తప్పని సరి. ఒకటి కన్నా ఎక్కువ సార్లు ట్రిమ్మింగ్ చేయించుకోవడం వల్ల జుట్టు నిర్జీవంగా కనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే కింది చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
- సాధారణంగా ట్రిమ్మింగ్ చేసిన వెంటనే వెంట్రుకలు పొడిబారి, గరుకుగా తయారవుతాయి. అయితే మీరు ఎంచుకున్న స్టైల్‌ను బట్టి వెంట్రుకలు మార్పు చెందుతాయి. ఉదాహరణకు కర్లీగా (ఉగంరాల మాదిరి), స్ట్రయిట్ కట్, భ్లౌడరింగ్, షాట్‌కట్ వంటివి స్టైల్స్‌లో కురులను ట్రిమ్మింగ్ చేయించుకోవచ్చు. ఇలా చేసినప్పుడు చివర్లు బాగా పొడిబారుతాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే తల స్నానం చేసిన వెంటనే కండీషనర్ రాసుకుంటే సరిపోతుంది.
- అలాగే తలస్నానం దువ్వకూడదు. కాస్త పొడిబారిన తర్వాత దువ్వితే వెంట్రుకలు చిక్కుబడకుండా ఉంటాయి. లేదంటే వెంట్రుకలు మధ్య మధ్యలో విరిగిపోవడం, చివర్లు చిట్టిపోవడం వంటి సమస్య ఏర్పాడుతుంది.
- వెంట్రుకలు బాగా చిట్లిపోతే! ఇలా చేయండి. తల స్నానం చేసిన తర్వాత జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు కండీషనర్, మాయిశ్చరైజర్‌ను నిండుగా పట్టించండి. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా, మెత్తగా తయారవుతుంది.
- కురులు బాగా చిక్కులు పడితే కొబ్బరి నూనెను వెంట్రుకలకు నిండుగా పట్టించాలి. నూనె పట్టించిన అరగంట తర్వాత చల్లటి నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే వెంట్రుకలు చిట్లిపోకుండా, విరిగిపోకుండా ఉంటాయి.