Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చదువుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్లే మహిళలు చీకటి పడకుండానే ఇల్లు చేరుకోవడం అనేది సాధ్యమయ్యేది కాదు. మన హైదరాబాద్ లాంటి నగరాల్లో గంటల తరబడి ట్రాఫిక్‌లో ప్రయాణాల కారణంగా మరింత ఆలస్యం అవుతుంది. షాపింగ్ మాల్స్‌లో, కాల్ సెంటర్లలో పనిచేసేవాళ్లు ఏ అర్ధరాత్రో డ్యూటీ ముగించుకుని రావలసిన పరిస్థితి. అలాంటప్పుడు సమయంలో మహిళలకు భద్రత ఎవరు ఇస్తారు. వారికి రక్షణ ఎలా? అన్న ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఎవరో వస్తారని మనం ఎదురు చూడకుండా మనకు మనమే రక్షణ కల్పించుకోవాలి. కాన్ఫ్డెన్స్నే బాడీగార్డుగా అనునిత్యం మీ వెంట ఉంచుకోవాలి. అందుకు కొన్ని చిట్కాలు పాటించండి..
* ఇంటినుంచి కాలు బయట పెట్టే ముందు మీ హ్యాండ్ బ్యాగులో చాకు, పెప్పర్ స్ప్రే లాంటి రక్షణాయుధాలు పెట్టుకోవడం మర్చిపోవద్దు. పెప్పర్ స్ప్రే లాంటివి అందుబాటులో లేకపోతే కనీసం కారప్పొడి అయినా ఉంచుకోండి.
* నడిచి వెళ్తున్నా, టూ వీలర్ మీద వెళ్తున్నా... వీలైనంత వరకూ షార్ట్‌కట్ దారుల్లో వెళ్లొదు. మనుషులు ఎక్కువగా తిరిగే దారుల్లో వెళ్లితే మంచిది.
- నిర్మానుష్యంగా ఉండే దారుల్లో వెళ్లాల్సి వస్తే... టూ వీలర్‌ని పొరపాటున కూడా ఆపకండి. నడిచి వెళ్తుంటే కనుక బ్యాగులో ఉన్న ఆయుధాన్ని తీసి చేతితో పట్టుకోండి.
- ఒంటరిగా నడుస్తున్నప్పుడు భయంగా దిక్కులు చూడటం, టెన్షన్‌గా చేతులు నులుముకోవడం, చెమట తుడుచుకోవడం వంటివి చేయవద్దు. మీ నడకలో, బాడీలాంగ్వేజీలో స్టిఫ్నెస్ ఉండాలి. అప్పుడు మీ జోలికి ఎవరూ రారు.
- సెల్‌ఫోను మాట్లాడుకుంటూనో, ఏదో ఆలోచిస్తూనో పరిసరాలను గమనించడం మర్చిపోవద్దు. నడుస్తూనే నలుదిశల్లో ఏం జరుగుతోందో చూసుకోవాలి.
- ఆటో, క్యాబ్ ఎక్కే ముందు డ్రైవర్ని ఏదో ఒకటి మాట్లాడించండి. అతడు మామూలుగా ఉన్నాడా లేక మద్యం సేవించి ఉన్నాడా అన్నది తెలుస్తుంది.
- వాహనంలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు వెహికిల్ నంబర్ నోట్ చేసుకుని, వెంటనే ఇంట్లోవాళ్లకు చెప్పండి. వీలైతే ఆటో ఏ రూట్లో వెళ్తుందో ఎప్పటికప్పుడు తెలియచేయాలి.