Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేకప్ వేసుకోవడం అలవాటు లేనివాళ్లు అనుకోకుండా వేసుకోవాల్సి వస్తే కాస్త ఇబ్బంది పడతారు. అందుకే కొన్ని మెలకువలు తెలుసుకుని ఉండటం మంచిది.
* మేకప్ వేసుకునే ముందు రెండు సార్లు క్లెన్సర్‌తో ముఖం శుభ్రం చేసుకోవాలి. మొదటిసారి కేవలం ముఖంపై ఉన్న జిడ్డు తొలిగిపోతే రెండోసారి చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి. ఆ తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పాడవకుండా చేస్తుంది.
* మేకప్‌ను ప్రైమర్‌తో మొదలుపెట్టాలి. ఇది విభిన్న రంగుల్లో ఉండే ఐషాడో, బ్లష్ వంటి వాటి ప్రభావం చర్మంపై పడకుండా కాపాడుతుంది. ఇది రాసుకున్నాక చర్మ రంగుకు నప్పే ఫౌండేషన్‌ను రాసుకోవాలి.
* కొంతమంది కన్సీలర్ను ఫౌండేషన్ కన్నా ముందే రాసుకోవాలంటే, ఇంకొంతమంది మొదట ఫౌండేషన్ రాసుకోవడం మేలని చెబుతారు. అయితే ఈ నియమం చర్మ రకాన్ని బట్టి మారుతుంది. ఒకసారి ప్రయత్నించి చూస్తే ఏది ముందు రాసుకోవాలో మీరే తెలుసుకోగలరు.
* చివరగా మేకప్‌ను సెట్టింగ్ పౌడర్‌తో ముగించాలి. ఇది మేకప్ ఎక్కువ సేపు చెక్కు చెదరకుండా ఉంచుతుంది. సందర్భాన్ని బట్టి వీటిలో మ్యాటీ రకాలను కూడా ఎంచుకోవచ్చు.
* బుగ్గలపై బ్లష్, కళ్లకు మేకప్ వేసుకోవాలి. కండ్ల విషయానికొస్తే ముందు ఐషాడో, ఆ తరువాత ఐ లైనర్, చివరగా మస్కారా రాసుకోవాలి. పెదాలకు రంగు వేసుకునేటప్పుడు ముందు లిప్‌స్టిక్ తరువాత లిప్‌లైనర్ రాయాలి.
పైవన్నీ పూర్తయ్యాక చివరగా గులాబీ నీటిని స్ప్రేలా కొట్టుకోవాలి. ఇది మేకప్ ఎక్కువ సేపు తాజాగా ఉండేలా చూస్తుంది.